Thursday, December 5, 2024

J and K – తొలి రోజునే క‌శ్మీర్ అసెంబ్లీలో డిష్యూం డిష్యూం

ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ తీర్మానం
దీనిని వ్య‌తిరేకిస్తూ బిజెపి స‌భ్యుల గంద‌గోళం
అధికార‌,విప‌క్ష స‌భ్యుల మ‌ధ్య మాట‌ల యుద్ధం
తీర్మానం అమోదించాల‌న్న అధికార ప‌క్షం
వ‌ద్దు వ‌ద్దంటూ అడ్డం ప‌డ్డ బిజెపి
తీర్మానాన్ని ప‌క్క‌న పెట్టిన స్పీక‌ర్

శ్రీనగర్: ఆరేళ్ల తర్వాత ప్రారంభమైన జమ్మూకశ్మీర్ అసెంబ్లీ సమావేశాల్లో రసాభాస చోటుచేసుకుంది. సోమవారం జరిగిన తొలి అసెంబ్లీ సమావేశంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) ఎమ్మెల్యే వహీద్ పర్రా ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనినిబిజెపి స‌భ్యులు వ్య‌తిరేకించారు. దీంతో అధికార, విప‌క్ష స‌భ్యుల మ‌ధ్య ఆర్టికల్ 370పై మధ్య మాటల యుద్ధం జరిగింది. జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక హోదా కొనసాగించాలని డిమాండ్ చేసింది ఎమ్మెల్యే వహీద్ పర్రా . అయితే, ఈ తీర్మానాన్ని అనుమతించకూడదని భారతీయ జనతా పార్టీ స‌భ్యులు అడ్డుకున్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా బీజేపీపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. పబ్లిసిటీ కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నట్లు 2019 ఆగస్టు 5న తీసుకున్న నిర్ణయాన్ని జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఆమోదించడం లేదని ముఖ్యమంత్రి తెలిపారు. దీంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధంతో సభలో ద‌ద్ద‌రిల్లింది. కాగా అధికారిక నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన స్పీకర్ రహీమ్ రాథర్ మాట్లాడుతూ అటువంటి తీర్మానాన్ని తాను ఇంకా అంగీకరించలేదని చెప్పారు.

ఇది ఇలా ఉంటే 2019లో జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు చేయడంతో 2019లో ప్రత్యేక ప్రతిపత్తి హోదాను కోల్పోయింది. దీంతోపాటు ఆ రాష్ట్రం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది. జమ్మూకశ్మీర్కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించాలని ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ డిమాండ్ చేస్తోంది. ఒమర్ అబ్దుల్లా కూడా గత అయిదేళ్లుగా అందుకోసమే తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎస్సీ-కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు . జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరుతూ ఇటీవల ఒమర్ మంత్రివర్గం తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. దానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదం కూడా తెలిపారు.ఈ నేప‌థ్యంలోనే అసెంబ్లీలో కూడా నేడు ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై గంద‌ర‌గోళ ప‌రిస్థితులు ఏర్ప‌డ‌టంతో స్పీక‌ర్ ఈ తీర్మానాన్ని ఆమోదించ‌కుండా తాత్కాలికంగా ప‌క్క‌న పెట్టారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement