Friday, November 29, 2024

TG | అది పొలీసుల క‌ట్టుక‌థ‌… జైలు నుంచి పట్నం నరేందర్‌ రెడ్డి లేఖ !

వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి ఘటనలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్నారు. కాగా, జైలు నుంచి పట్నం నరేందర్ రెడ్డి సంచలన లేఖ విడుదల చేశారు.

పోలీసులు తన పేరుతో ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ పూర్తిగా తప్పని స్పష్టం చేశారు. కేటీఆర్ గురించి కానీ కేసు గురించి కానీ ఎలాంటి స్టేట్మెంట్ పోలీసులు తన నుంచి తీసుకోలేదని నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. కోర్టుకు వచ్చాక అడ్వొకేట్ అడిగితే రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారని.. అప్పటివరకు అందులో ఏముందో తనకు తెలియదన్నారు.

కేటీఆర్ సహా ఇతర ముఖ్య నేతల ఆదేశాలతో దాడులు చేయించినట్లు పోలీసులు కట్టుకథ అల్లారని.. తాను పోలీసులకు ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదన్నారు. రిమాండ్ రిపోర్టులో పోలీసులు చెప్పిన వాటిలో నిజం లేదని.. నా స్టేట్మెంట్ పరిగణనలోకి తీసుకుని విచారణ చేయాల‌ని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement