Saturday, April 20, 2024

స‌ముద్ర మ‌ట్టానికి 3,488కిలోమీట‌ర్ల ఎత్తులో త్రివ‌ర్ణ ప‌తాకం

స‌ముద్ర మ‌ట్టానికి 3,488కిలోమీట‌ర్ల ఎత్తులో త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగ‌ర‌వేశారు ఇండో టిబెట‌న్ బార్డ‌ర్ పోలీసులు. భారత్‌-చైనా సరిహద్దుల్లోని లఢక్‌ నుంచి ఉత్తరాఖండ్‌ వరకు అన్ని ప్రాంతాల్లో జాతీయ పతాకాలను ఎగురవేస్తూ ప్రజల్లో ఉత్సాహం నింపుతున్నారు. దీంతోపాటు ప్రత్యేకంగా రూపొందించిన ‘జై హింద్‌’ పాటను విడుదల చేశారు. వజ్రోత్సవాల్లో భాగంగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని నేటి నుంచి ఈ నెల 15 వరకు నిర్వహించనున్నారు. దీనికోసం దేశవ్యాప్తంగా జాతీయ జెండాలను పంపిణీ చేశారు. పోస్టల్‌ శాఖ ఇప్పటికే కోటీ 20 లక్షలకుపైగా త్రివర్ణ పతాకాలను విక్రయించింది. కాగా, తెలంగాణలో 75వ ఘనతంత్ర దినోత్సవ వేడుకలు ఈ నెల 22 వరకు జరుగనున్నాయి. ప్రతిరోజు ఒక్కో కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఈనెల 16న ఉయదం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం చేపట్టనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement