Thursday, April 18, 2024

నాని బ‌ర్త్ డేకి రీ రిలీజ్ కానున్న.. అలా మొద‌లైంది

ఈ మ‌ధ్య‌కాలంలో పాత చిత్రాలు తిరిగి థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ అవుతున్నాయి. ఇప్ప‌టికే ఒక్కడు, జల్సా, ఖుషి, పోకిరి, బాద్ షా, గ్యాంగ్ లీడర్, వర్షం సినిమాలున్నాయి. ఇటీవల ఈ సినిమాలు 4కె వెర్షన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీగా వసూళ్లు రాబట్టాయి. సూపర్ హిట్ ఫిల్మ్ అలా మొదలైంది కూడా థియేటర్లలోకి రాబోతుంది. న్యాచురల్ స్టార్ నాని, నిత్యా మీనన్ జంటగా నటించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో నాని.. నిత్యా కెమిస్ట్రీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఈ సినిమా మరోసారి ఆడియన్స్ ముందుకు రాబోతుంది. నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ఫిబ్రవరి 24నల ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్ చేయబోతున్నారట. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఇప్పటికీ మూవీ లవర్స్ కు ఆల్ టైమ్ ఫేవరెట్. సినిమానే కాదు.. ఇందులోని సాంగ్స్ సైతం శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నిత్యా.. గాయనిగానూ మెప్పించింది. ఈ సినిమాకు కళ్యాణ్ మాలిక్ సంగీతం అందించాగా.. రెండు నంది అవార్డులు గెలుచుకుంది. మ‌రి ఈ చిత్రం ఏ మేర‌కు నేటి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement