Tuesday, December 3, 2024

IT Raids I రియల్ ఎస్టేట్ సంస్థలపై ఐటీ దాడులు

హైదరాబాద్‌: నగరంలో పలుచోట్ల ఆదాయపన్నుశాఖ అధికారులు సోదాలు చేపట్టారు. అన్విత గ్రూపు కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. పలు దస్త్రాలను వారు పరిశీలిస్తున్నారు..సంస్థ డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్‌, రాయదుర్గం, కొల్లూరు, సంగారెడ్డిలో ఆదాయపన్నుశాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

అలాగే, హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఏకకాలంలో 30 చోట్ల దాడులు చేశారు. కొల్లూరు, రాయదుర్గం, ఐటీ కారిడార్‌లోని విజయవాడకు చెందిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారుల ఇండ్లలో తనిఖీలు చేస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌ చైతన్యపురిలోని గూగి ప్రాపర్టీస్‌ అండ్‌ డెవలపర్స్ కార్యాలయంతోపాటు, మలక్‌పేటకు చెందిన కాంగ్రెస్‌ నేత షేక్‌ అక్బర్‌ ఇండ్లలో, అతని 15 గూగి ప్రాపర్టీస్‌ ఆఫీసుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement