Tuesday, April 16, 2024

సైనిక చర్య కాదు, ఇది ముమ్మాటికీ యుద్ధమే.. పుతిన్‌పై పోప్‌ ఫ్రాన్సిస్‌ విమర్శలు

ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై పోప్‌ ఫ్రాన్సిస్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి తరువాత తొలిసారి పోప్‌ స్పందించారు. ఉక్రెయిన్‌పై పుతిన్‌ దాడిని పోప్‌ పరోక్షంగా ఖండించారు. జాతీయవాద ప్రయోజనాల కోసం ఘర్షణలు చేస్తున్నారని విమర్శించారు. మాస్కో ఫిబ్రవరి 24న ప్రారంభించిన ఈ చర్య భూభాగాన్ని ఆక్రమించడానికి కాకుండా.. పొరుగు దేశ సైన్యాన్ని నిర్వీర్యం చేయడానికి, నిర్మూలించడానికి రూపొందించిన ప్రత్యేక సైనిక చర్య అన్నారు. రష్యా ఉపయోగించిన పరిభాషను పోప్‌ ఇప్పటికే తిరస్కరించారు. ఇది సైనిక చర్య కాదన్న పోప్‌.. ముమ్మాటికీ ఇదే యుద్ధమే అని ప్రకటించారు.

మధ్యధరా ద్వీప దేశానికి రెండు రోజుల పర్యటన సందర్భంగా వచ్చిన పోప్‌.. మాల్టిస్‌ అధికారులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. యూరప్‌ తూర్పు నుంచి, సూర్యోదయ భూమి నుంచి.. ఇప్పుడు యుద్ధం కారణంగా చీకటి నీడలు అలుముకుంటున్నాయి అని అన్నారు. ఇతర దేశాలపై దండయాత్రలు అత్యంత క్రూరమైనవిగా చెప్పుకొచ్చారు. అణు బెదిరింపులు గతంలోని భయానకమైన జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయని పుతిన్‌ను ఉద్దేశిస్తూ విమర్శించారు. యుద్ధం.. మంచుతో కూడిన గాలులు, మరణం, విధ్వంసం.. ద్వేషాన్ని మాత్రమే మేల్కొలుపులో తీసుకొస్తాయని, చాలా మంది ప్రజలు తమ జీవితాలను కోల్పోయారని, ప్రపంచమంతటిపై ఈ యుద్ధం ప్రభావం ఉందని వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement