Friday, March 29, 2024

రామ్‌ దేవదాసుకు 16 ఏళ్ళు

హీరో రామ్‌ పోతినేని కెరీర్ పరంగా స్వీట్‌ సిక్సీటీన్‌లో అడుపెట్టారు. సరిగ్గా 16 ఏళ్ళ క్రితం రామ్‌కు నటునిగా పునాది వేసిన ‘దేవదాసు’ సినిమా విడుదలైంది. అనేక మంది కొత్త కుర్రాళ్ళను శోధించి రామ్‌ను హీరోగా ఎంపికచేసుకున్నారు దర్శకనిర్మాత వైవియస్‌.చౌదరి. గోవా సుందరి ఇలియానా నాయికగా పరిచయమైంది. దేవదాసు గురించి హీరో రామ్‌ గుర్తుచేసుకున్నారు. ట్వీట్‌ చేస్తూ తన తొలి చిత్రమని పేర్కొన్నారు. ‘దేవదాసు’ 219 రోజులు హైదరాబాద్‌లో, 175 రోజులు 19 కేంద్రాల్లో ప్రదర్శితమైందని తెలుపుతూ చక్రీ సంగీతం అందించారని పేర్కొన్నారు. ‘దేవదాసుస‌ సినిమా ఎక్కువ భాగం అమెరికాలో చిత్రీకరణ జరుపుకుంది. తొలి సినిమాతోనే రామ్‌ హీరోగా నిలదొక్కుకున్నారు. ఆయనది సినీ నేపథ్యం ఉన్న కుటుంబమే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement