Tuesday, March 26, 2024

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ వరల్డ్‌ కప్‌ 2022లో భారత్‌కు మూడు స్వర్ణాలు, నాలుగు వెండి పతకాలు..

జర్మనీ : జర్మనీలో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ వరల్డ్‌ కప్‌ 2022 టోర్నమెంట్‌లో భారత్‌కు పతకాల పంట పండింది. తొలి రోజే మూడు స్వర్ణాలు, నాలుగు వెండి పతకాలు సాధించారు. దీంతో ఐఎస్‌ఎస్‌ఎప్‌ జూనియర్‌ వరల్డ్‌ కప్‌ టోర్నీ పతకాల జాబితాలో భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది. బాల్‌ రోలింగ్‌లో రుద్రాంక్ష పాటిల్‌ బంగారు పతకం చేజిక్కించుకోగా, 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్స్‌ పురుషుల విభాగంలో అభినవ్‌ షా వెండి పతకం గెలుచుకున్నాడు.

జూనియర్‌ వుమెన్స్‌ ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో రమిత సిల్వర్‌ పతకం కైవసం చేసుకుంది. 10మీటర్ల ఎయిర్‌ పిస్టోల్‌ విభాగంలో శివ నార్వల్‌ 16-12 తేడాతో సరబ్‌జోత్‌ సింగ్‌పై గెలిచాడు. గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. జూనియర్‌ ఉమెన్స్‌ 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో మను భకర్‌ సిల్వర్‌ మెడిల్‌ సాధించగా, పాలక్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement