Thursday, April 25, 2024

నిర్ధోషిగా బయటికొస్తా, పార్టీ నేతలను ఇబ్బంది పెట్టను.. మంత్రి పదవికి ఈశ్వరప్ప రాజీనామా

కాంట్రాక్టర్‌ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నాటక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సీఎం బసవరాజ్‌ బొమ్మైని కలిసి రాజీనామా లేఖను అందజేశారు. మంత్రి ఈశ్వరప్ప తన సొంతూరు శివమొగ్గలో మాట్లాడుతూ.. పార్టీ నేతలను ఇబ్బందిపెట్టడం ఇష్టం లేకనే.. తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు స్పష్టం చేశారు. తాను నిర్ధోషి అని నిరూపించుకుంటానని చెప్పుకొచ్చాడు. అప్పటి వరకు మంత్రి పదవికి దూరంగానే ఉంటానని తేల్చి చెప్పాడు. సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు తనకు ఫోన్‌ చేసిన మద్దతుగా నిలిచారన్నారు. బీజేపీ నాయకుడు ఎవరూ తప్పు చేయరనే నమ్మకాన్ని తనకు తెలియజేశారని వివరించారు.

మద్దతుదారులతో సీఎం నివాసానికి..

తన మద్దతుదారులతో కలిసి సీఎంను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం ఉడుపిలో కాంట్రాక్టర్‌ సంతోష్‌ పాటిల్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. వాట్సాప్‌లో రాసిన డెత్‌ నోట్‌లో మంత్రి ఈశ్వరప్ప, ఆయన అనుచరులపై ఆరోపణలు చేశారు. అటు పాటిల్‌ సోదరుడు ప్రశాంత్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మంత్రిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. మంత్రి పదవికి ససేమిరా అన్న ఈశ్వరప్పపై అధిష్టానంతో పాటు సీఎం ఒత్తిడి వచ్చినట్టు తెలుస్తున్నది. అందుకే చివరికి మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం. రాష్ట్రంలోని కాంట్రాక్టులు అందరూ కలిసి.. ఈశ్వరప్ప అవినీతి చిట్టాను బహిర్గతం చేసేందుకు నిర్ణయించినట్టు తెలుస్తున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement