Wednesday, April 24, 2024

టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వ‌డం ల‌క్కీగా ఫీల‌వుతున్నా – ఆషికా రంగ‌నాథ్

” తెలుగు, కన్నడ భాషా చిత్రాలకు వర్క్‌ విషయంలో పెద్దగా తేడా ఉండదని, భాష మాత్రమే వ్యత్యాసం. అయితే తెలుగులో మాత్రం ప్రమోషన్స్‌ చాలా బాగా చేస్తారు. మంచి ప్లానింగ్‌తో ముందు కెళతారు” అని అంటు-న్నారు హీరోయిన్‌ ఆషికా రంగనాథ్‌. ఈ బ్యూటీ- తెలుగులో నటిస్తోన్న తొలి చిత్రం ‘అమిగోస్‌’. నందమూరి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 17న ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ ఆషికా రంగనాథ్‌ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. అమిగోస్‌ సినిమా జర్నీ ఎలా మొదలైందనే విషయంతో పాటు- ఆమె వర్కింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ను వివరించారు. ఆషికా రంగనాథ్‌ మాట్లాడుతూ…


చిన్నతనం నుండి తెలుగు సినిమాలు, పాటలు వినేదాన్ని దాని వల్ల తెలుగు అర్థమయ్యేది. ఇప్పుడు సినిమా చేస్తున్నా ను. దాని వల్ల నేర్చుకోవటానికి అవకాశం వచ్చింది. తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటు-న్నాను సినిమాలో డైలాగులు చె ప్పడం వల్ల కాస్త నేర్చుకోగలుగుతున్నాను
తెలుగులో నటించడానికి ఇంతకాలం ఎం దుకుపట్టింది ? అనే విషయాన్ని మీరు ఇక్కడున్న దర్శకుడుని అడగాలి ఎందుకు ఆ అమ్మాయిని కూడా తీసుకురావడానికి అన్ని రోజులు పట్టింది అని నిజానికి నాకు తెలుగు ఇండస్ట్రీ నుంచి కొన్ని ఆఫర్లు వచ్చాయి అయితే ఆ సమ యంలో నాకు కాల్షిట్‌ అడ్జస్ట్‌ కాక పోవడం ఇలాంటి విషయాలన్నీటి వలన తెలుగులో సిని మాలు చేయడం కాస్త ఆలస్య మైంది
అమిగోస్‌ సినిమా కోసం ముందు ఇంకో హీరోయిన్‌ ని తీసుకున్నామని చెప్పారు కానీ నేను బెంగళూరు వెళ్ళిన తర్వాత మా మేనేజర్‌ ఫోన్‌ చేశారు. సినిమా గురించి చెప్పారు. ఎందుకు వాళ్ళు ఇంకో అమ్మాయిని తీసుకున్నామ ని చెప్పారే అని అన్నాను. దానికి తను ఆ వివరాలు తెలియవు అన్నా రు. అప్పుడు నేను డైరెక్టర్‌ రాజేం దర్‌ రెడ్డిగారు చెప్పిన కథను ఫోన్‌ లోనే విన్నాను. సినిమాలో హీరో మూడు పాత్రలు చేయ టం.. నా పాత్రను మలిచిన తీరు అన్ని నచ్చడంతో సినిమాకు ఓకే చెప్పేశాను. అలా ఈ ప్రాజెక్టు ఓకే అయింది.
నేను కళ్యాణ్‌ రామ్‌ గారిని ఫస్ట్‌ అమిగోస్‌ సెట్‌ లోనే చూసాను హా య్‌ నేను కళ్యాణ్‌ అన్నారు. హా య్‌ నేను ఆషిక అన్నాను. అలా మా పరిచయం జరిగింది. స్టా ర్టింగ్‌లో మేమిద్దరం పెద్దగా ఒకరితో ఒకరు మాట్లాడు కునేవాళ్ళం కాదు. ఇద్దరు సైలెంట్‌గా ఉండే వ్యక్తులు కా నీ రోజులు గడుస్తున్న కొద్ది సెట్లో నాకు తెలుగు డైలాగ్స్‌ విషయంలో కళ్యాణ్రామ్‌ చాలా సాయం చేశారు. డైలాగ్స్‌ ఎలా పలకాలి అలాం టిది నేర్చు కున్నాను అలా నాకు ఎంత మంచి నటు-డితో పని చేస్తున్నాను అర్థమైంది. కళ్యాణ్‌ రామ్‌ చాలా కూల్‌ పర్సన్‌ ఆయనకి చాలా విషయాలు మీద ఎక్కువ అవగాహన ఉంది అలాంటి ఒక లెజెండ్‌ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోతో పని చేస్తున్నందుకు చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమాలో ఈ సినిమాలో ఆయన మూడు పాత్రలో నటించారు ప్రతి పాత్రకు ఆయన చేసిన కృషి నేను కళ్ళారా చూశాను ఎవరో ఏంటో చెప్పకుండానే ఏ క్యారెక్టర్‌ లేదు చెప్పగలిగినంత వేరియేషన్‌ చూపించారు. ఆయన డెడికేషన్‌ చూసి ఫిదా అయ్యాను.
నిన్న అమిగోస్‌ సినిమా లోని సాంగ్‌ డ్రీమ్స్‌ రిలీజ్‌ అయినప్పుడు చాలామంది వెల్‌కమ్‌ టు- టాలీవుడ్‌ అని మెసేజ్‌ పెట్టారు. ఇక్కడ కొత్త వా రిని చా లా బాగా ఆదరిస్తారని పేరు ఉంది. దా న్ని నేను ప్రత్యక్షంగా ఎక్స్పీరియన్స్‌ చేశాను.
తెలుగు సినిమాల్లో ఫస్ట్‌ నుంచి పబ్లిసిటీ- చాలా బాగా చేస్తారు అనే పేరుంది లా విష్‌ గా సినిమా తీస్తారు అనే పేరు ఉంది కన్నడ ఇండస్ట్రీల్రో కూడా పబ్లిసిటీ- బాగా చేస్తారు కానీ తెలు గుతో పోలిస్తే ఇం తకుముందు అ క్కడ అంతగా ఉండేది కాదు ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీల్రొ  కూడా ఎక్కువగా పబ్లిసిటీ- చేస్తున్నారు.
కన్నడలో ఇప్పటి వరకు 10-12 సిని మాలు చేశాను. తమిళంలో ఓ సినిమా చేశాను. అమిగోస్‌ చిత్రంతో తెలుగులో కి అడుగు పెట్టాను. నటిగా ఎన్నో వైవి ధ్యమైన పాత్రలు చేయాలి. అలాగే పలు భాషల్లోనూ నటించాలి.
తెలుగులో ఇతర సినిమాల్లో నటిం చమని అవకాశాలు వస్తున్నాయి. అయి తే అమిగోస్‌ సిని మా రిలీజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాను. దీని తర్వాత మంచి పాత్రలని పించిన సినిమాల్లో నటిస్తాను.
తెలుగు ఆడియెన్స్‌ గొప్ప మనసున్నవారు. ఇక్కడ కన్నడ పరిశ్రమకు చెందిన నటీ-నటు-లు చాలా మంది రాణిస్తున్నారు. హీరోయిన్సే కా దు.. కిచ్చా సుదీప్‌, ధనంజయ్‌, దునియా విజ య్‌, యష్‌.. సహా చాలా మందిని తెలుగు ప్రేక్షకు లు బాగా ఆదరిస్తున్నారు. నన్ను కూడా అలాగే ఆదరిస్తారనే నమ్మకంతో ఎదురు చూస్తున్నా
నటిగా మంచి రోల్‌ చేయటమే కాదు.. మంచి ప్రొడక్షన్‌ హౌస్‌, హీరో ఉన్న సినిమాలో యాక్ట్‌ చేస్తే మంచి ఎంట్రీ- అవుతుంది. నాకు అమిగోస్‌ సినిమాతో అవన్నీ చక్కగా కుదిరాయనిపిస్తుంది. దీంతో ఈ సినిమా నాకు కరెక్ట్‌ ఎంట్రీ- అనిపిస్తుంది.
బాలకృష్ణగారు చేసిన ఎన్నో రాత్రులొస్తాయిగానీ.. వంటి ఐకానిక్‌ సాంగ్‌లో నటించటం లక్కీగా ఫీల్‌ అవు తున్నాను. కచ్చితంగా నారోల్‌ అందరికీ నచ్చుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement