Friday, March 29, 2024

ధావన్‌ స్థానంలో ఇషాన్‌?

వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ వన్డే భవితవ్యంపై కొత్త సెలక్షన్‌ కమిటీ చర్చించే అవకాశం ఉంది. మూడో వన్డేలో బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో విజయ తీరాలకు తీసుకెళ్లిన ఇషాన్‌ కిషన్‌ పేరు వెలుగులోకి వచ్చింది. ధావన్‌ తన చివరి తొమ్మిది వన్డేల్లో ఎనిమిందింటిలో తీవ్రంగా పోరాడాడు. బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో డబుల్‌ సెంచరీ సాధించిన ఇషాన్‌ సింగ్‌ ఒక్క దెబ్బతో పలు రికార్డులు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ వన్డేల్లో తొలి సెంచరీనే ద్వి శతకం మార్చడమే గాక మరిన్ని ఘనతలు తన ఖాతాలో వేసుకున్నాడు జార్ఖండ్‌కు చెందిన 24 ఏళ్ల ఇషాన్‌.

ఓపెనింగ్‌ స్థానానికి తను సరిగ్గా సరిపోతాననే సంకేతం ఇచ్చాడు ఇషాన్‌ . దీంతో వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఉనికినే ప్రశ్నార్థకం చేశాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సెలెక్టర్‌ సబా కరీం కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా గనక ఒకవేళ వన్డేల్లో 300పై చిలుకు పరుగులు చేయాలంటే శిఖర్‌ ధావన్‌కు జట్టులో చోటివ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement