Saturday, April 20, 2024

‘ఆర్ఆర్ఆర్’ లో అదో అద్భుతమైన సీనట ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు గా, రామ్ చరణ్…కొమరం భీం గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. ఇప్పటికీ ఇద్దరు పాత్రలకు సంబంధించి విడుదలైన వీడియోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.

ఈ సినిమాలో రామరాజు భీమ్ ల మధ్య కారాగారంలో భావోద్వేగ పూరిత సన్నివేశం ఉంటుందట. యాక్షన్ సన్నివేశాలు మినహా… ఎమోషనల్ పరంగా ఆ సన్నివేశం చాలా బాగుంటుందని తెలుస్తోంది. ఈ సీన్ సినిమా మొత్తానికి ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తుందట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement