Wednesday, April 24, 2024

రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఖర్గేనే?

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీలో మల్లికార్జున ఖర్గే జోడు పదవులపై విస్తృత చర్చ జరుగుతోంది. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మల్లికార్జున్‌ ఖర్గే బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్‌ అధ్యక్ష బరిలో దిగడానికి ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత అధ్యక్షుడిగా గెలుపొందారు. కానీ, ఇప్పుడు మళ్లి ఆయనకే రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు ఇవ్వాలని కాంగ్రెస్‌ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. రాజ్యసభలో ప్రతిపక్ష పదవి కోసం దిగ్విజయ్‌ సింగ్‌, పి.చిదంబరం పోటీ పడుతున్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ ఈ అంశంపై కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ స్ట్రాటజీ గ్రూప్‌ సభ్యులతో సమావేశమై చర్చించినట్లు సమాచారం.

ఈ సమావేశానికి మల్లికార్జున ఖర్గే, జైరాం రమేశ్‌, కేసీ వేణుగోపాల్‌ తదితరులను ఆహ్వానించినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అయితే ప్రతిపక్ష పదవికి పోటీ పడుతున్న డిగ్గీ, చిద్దూలను ఆహ్వానించకపోవడం గమనార్హం. ఒక వేళ మల్లికార్జున్‌ ఖర్గే రెండు పదవులూ చేపడితే మాత్రం కాంగ్రెస్‌ తీర్మానించుకున్న ఒక వ్యక్తి ఒక పదవి నిబంధనపై యూటర్న్‌ తీసుకున్నట్టే అవుతుంది. అయితే రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఖర్గేకే అవకాశం కల్పిస్తారా? లేదా అన్న అంశంపై ఇంకా స్పష్టం రాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement