Saturday, April 20, 2024

బండి సంజయ్ పై ఐపీఎస్ అసోసియేషన్ సీరియస్..

ఐపీఎస్ అధికారులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్. భైంసా ఘటనలో శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు తీవ్రంగా కృషిచేశారని తన ప్రకటనలో పేర్కొన్నారు ఐపీఎస్ అధికారుల అసోసియేషన్. బండి సంజయ్ వాఖ్యలను తీవ్రంగా పరిగణించింది. పోలీసులపై ప్రజలకు నమ్మకం పోయేలా బండి సంజయ్ వాఖ్యనించడం సరికాదంటూ అభ్యంతరం వ్యక్తంచేసింది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పగలు, రాత్రి తేడాలేకుండా కష్టపడుతున్నాం, కోవిడ్ సమయంలోనూ పోలీసులు కీలక పాత్ర పోషించారని, కానీ, పోలీసులపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తన ప్రకటనలో పేర్కొంది తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement