Friday, March 29, 2024

IPL : కొత్త ఫార్మాట్‌లో ఐపీఎల్‌, ఈనెల 29నుంచి మ్యాచ్‌లు.. షేడ్యూల్ రిలీజ్‌

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ ఎడిషన్ ఈనెల‌ 26న ప్రారంభం కానుంది. మే 29న జరిగే చివరి సెట్‌తో రెండు నెలల వ్యవధిలో 10 జట్లు ఫైన‌ల్ క‌ప్ కోసం త‌ల‌ప‌డ‌తాయి. ఈ మ్యాచులు ప్రారంభం కావ‌డానికి కేవలం 3 వారాల సమయం మాత్రమే ఉండ‌గా.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న టోర్నమెంట్ షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవ్వాల‌ ప్రకటించింది.. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఓపెనర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో తలపడనుంది. బీసీసీ ప్ర‌క‌ట‌నతో ఈ సంవత్సరం మ్యాచ్‌లు వేరే ఫార్మాట్‌లో ఆడటానికి సిద్ధంగా ఉన్నాయి. గెలిచిన టైటిళ్ల సంఖ్య, ఆడిన ఫైనల్స్ ఆధారంగా 10 జట్లను A, B అనే రెండు గ్రూపులుగా విభజించారు.

దీని ప్రకారం, గ్రూప్ Aలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కొత్తగా చేరిన‌ లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నాయి. మిగతా ఐదు జట్లు, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, కొత్తగా చేరిన‌ గుజరాత్ టైటాన్స్ గ్రూప్ బి లో భాగంగా ఉన్నాయి. కాగా, అన్ని లీగ్ మ్యాచ్‌లు మహారాష్ట్రలో జరగనున్నాయి.

విడుదల చేసిన షెడ్యూల్ విషయానికొస్తే.. ఈ సీజన్‌లో మొదటి డబుల్-హెడర్ మార్చి 27న జరుగుతుంది. ఈ సీజన్‌లో రెండు కొత్త జట్లను చేర్చుకోవడం వల్ల మ్యాచ్‌ల సంఖ్య పెరగడంతో డబుల్-హెడర్ రోజులు చాలా ఉన్నాయి. ఐపీఎల్‌లో జరిగే అన్ని లీగ్ మ్యాచ్‌లకు 25% ప్రేక్షకులను అనుమతించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్లేఆఫ్‌కు వేదికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement