Friday, February 3, 2023

ఐపీఎల్‌ 2023 వేలం పేర్లను నమోదు చేసుకున్న స్టార్‌ ఆటగాళ్లు

ఐపీఎల్‌ 2023 వేలం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నెల 23న ఈ వేలం జరగనుందని సమాచారం. ఇప్పటికే స్టార్‌ ఆటగాళ్లు తమ పేర్లు రిజిస్టర్‌ చేసుకున్నారు. వీళ్లలో ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్లు బెన్‌ స్టోక్స్‌ , సామ్‌ కరన్‌ రూ 2 కోట్ల కనీస ధరకు రిజిస్టర్‌ అయ్యారు. ఆస్ట్రేలియన్‌ యువ ఆల్‌ రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌, న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ కూడా వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కొచ్చిలో డిసెంబర్‌ 23వ తేదీన ఐపీఎల్‌ వేలం జరగనుంది. మొత్తం 991 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొంటున్నారు. వీళ్లలో 714 మంది భారత ఆటగాళ్లు, 277 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.

- Advertisement -
   

రూ 2 కోట్ల కనీస ధర

ఈ జాబితాలో బెన్‌ స్టోక్స్‌ , సామ్‌ కరన్‌, కామెరూన్‌ గ్రీన్‌, కేన్‌ విలియమ్సన్‌ , క్రిస్లిస్‌, క్రిస్‌ జోర్దాన్‌, జేసన్‌ హోల్డర్‌, నికోలస్‌ పూరన్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు ఉన్నారు. ఆదిల్‌ రషీద్‌, ట్రావిస్‌ హెడ్‌ , టామ్‌ బాంటన్‌, టైమల్‌ మిల్స్‌, జేమీ ఓవర్టన్‌, క్రేగ్‌ ఓవర్టన్‌, ఫిల్‌ సాల్ట్‌, ఆడం మిల్నే, జిమ్మీ నీషమ్‌, రిలీ రస్సో, రసీవాన్‌ డెర్‌ డెస్సెన్‌, ఏంజ్‌లో మ్యాథ్యూస్‌లు రూ 2 కోట్ల కనీస ధరకు రిజిస్టర్‌ అయ్యారు. ఈ బేస్‌ ధరలో ఒక్క భారత ఆటగాడు కూడా లేకపోవడం గమనార్హం.

కోటిన్నర కనీస ధర

సీన్‌ అబాట్‌, రిలే మెరిడిత్‌ , రిచర్డ్‌సన్‌, ఆడం జంపా, సకీబుల్‌ హసన్‌, హ్యారీ బ్రూక్‌, విల్‌ జాక్స్‌, డేవిడ్‌ మలన్‌, జేసన్‌ రాయ్‌, షెర్‌ ఫానే రూథర్‌ ఫర్డ్‌

కోటి కనీస ధర

మయాంక్‌ అగర్వాల్‌, కేదార్‌ జాదవ్‌, మనీష్‌ పాండే, మహమ్మద్‌ నబీ, ముజీబ్‌ ఉర్‌ రహమాన్‌, హెన్రిక్స్‌, టామ్‌ లాథమ్‌, డారిల్‌ మిచెల్‌, హెన్రిచ్‌ క్లసెన్‌, తబ్రేజ్‌ షంసీ, కుశాల్‌ పెరీరా, రోస్టన్‌ చేజ్‌, రకీం కార్న్‌వాల్‌, షై హోప్‌, డేవిడ్‌ వీసె, అకీల్‌ హోసెయిన్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement