Thursday, April 25, 2024

అమరజ్యోతి, సచివాలయం, అంబేద్కర్‌ విగ్రహంపై కవితలు.. ఈ నెల 31 చివరి గడువు

హైదరాబాద్‌, ఆంధధ్రప్రభ: రాష్ట్రంలో సచివాలయ నిర్మాణం, ఆంబేద్కర్‌ భారీ విగ్రహం, తెలంగాణ అమర జ్యోతి అద్భుత కట్టడాలు రాష్ట్ర చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచి పోతాయని తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ జూలూరి గౌరీశంకర్‌ చెప్పారు. ఈ మూడు అద్భుత కట్టడాలపై వచనా కవితలను ఆహ్వానిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. శనివారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 125 అడుగుల భారీ అంబేద్కర్‌ విగ్రహాన్ని త్వరలో ఆవిష్కరించుకునే సందర్భం సమీపంలోనే ఉందని చెప్పారు. ప్రపంచానికి మన దేశ ఔన్నత్యాన్ని చాటిన మహనీయడు,అట్టడుగు వర్గాల ప్రజల జీవితాల్లో చైతన్యాన్ని తీసుకురావడానికి అహర్నిషలు కృషిచేసిన అపరమేధావి డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ జీవితం పై ప్రత్యేక వచన కవితల సంకలనాన్ని తీసుకురావడానికి సృజన శీలులు, కవులు 25 లైన్లకు మించకుండా కవితలు రాసి పంపాలని ఆయన కోరారు.

అలాగే తెలంగాణ సంస్కృతికి దర్పణం పట్టేవిధంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయం పై కవితా సంకలాన్ని తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా సచివాలయ భవనంపై 25 లైన్లకు మించకుండా కవితలురాసి పంపాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అశువులు బాసిన అమరులను స్మరించుకోవడం కోసం నిర్మిస్తున్న తెలంగాణ అమర జ్యోతి పైన 25 పంక్తులకు మించకుండా వచనకవితలు రాసి పంపాలని ఆయన కోరారు. ఈ మూడు అంశాలపై వేరువేరుగా 25 పంక్తులకు మించకుండా మార్చి 31 లోగా కవితలురాసి పంపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఛైర్మన్‌ జాలూరి గౌరీ శంకర్‌,తెలంగాణ సాహిత్య అకాడమి అడ్రసు కు కవితలు పంపాలని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement