Thursday, April 25, 2024

విమ‌లారామ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో.. రుద్రంగి మోష‌న్ పోస్ట‌ర్

న‌టి విమలారామ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం రుద్రంగి. దొరల పాలన నేపథ్యంలో రూపొందింది. ఈ సినిమాకి అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించాడు. రసమయి బాలకిషన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో భీమ్ రావ్ దొరగా పరిచయం చేస్తూ, కొన్ని రోజుల క్రితం జగపతిబాబు పోస్టర్ ను రిలీజ్ చేశారు. తాజాగా ‘మీరాబాయి దొరసాని’ పాత్రలో విమలారామన్ ను పరిచయం చేస్తూ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దొరసాని అలంకరణలో విమలా రామన్ నిండుగా .. హుందాగా కనిపిస్తోంది. ‘కొన్ని ప్రశ్నలకి కాలమే జవాబిస్తుంది తమ్ముడు’ అనే డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మరో కీలకమైన పాత్రలో మమతా మోహన్ దాస్ నటించింది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement