Thursday, March 28, 2024

ప్ర‌తి ఒక్క‌రికి న‌చ్చే ఇంటింటి రామాయ‌ణం..

సూర్యదేవర నాగవంశీ, మారుతి టీమ్‌ సమర్పణలో ఐవీవై ప్రొడక్షన్స్‌ నిర్మించిన చిత్రం ‘ఇంటింటి రామాయణం’. వెంకట్‌ ఉప్పుటూరి, గోపీచంద్‌ యిన్నమూరి నిర్మాతలు. నరేష్‌, రాహుల్‌ రామకృష్ణ, నవ్యస్వామి, సురభి ప్రభావతి, గంగవ్వ ప్రధాన పాత్రధారులు. సురేష్‌ నరెడ్ల దర్శకుడు. కల్యాణ్‌ మాలిక్‌ సంగీతం అందించారు. గ్రామీణ నేపథ్యంలో, మధ్యతరగతి కుటుంబ కథగా తెరకెక్కించారు. ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో విడుదలవుతుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మీడియా సమావేశం నిర్వహించింది. ”తొలుత డిజిటర్‌ సినిమాగా ప్రారంభించాం. కానీ అవుట్‌పుట్‌ చూశాక థియేటర్లో ఆడు తుందనే నమ్మకంతో విడుదల చేస్తున్నాం” అని నిర్మాత నాగవంశీ చెప్పారు.


”ఇది ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి కనెక్ట్‌ అయ్యే సినిమా” అని మారుతి చెప్పారు. ”టీమ్‌ అందరి కృషి వల్లే అనుకున్నదానికంటే తక్కువ రోజుల్లో చిత్రీక రణ పూర్తిచేసినట్టు” దర్శకుడు సురేష్‌ నరెడ్ల చెప్పారు. ”ఇది మట్టి కథ” అని నరేష్‌ పేర్కొన్నారు. రాహుల్‌ రామకృష్ణ, నవ్వ స్వామి, నిర్మాతలు సినిమా గురించి వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement