Thursday, March 28, 2024

ఫిబ్రవరి 6 నుంచి ప్రొఫెసర్స్‌ పోస్టులకు ఇంటర్య్వూలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఎస్‌పీఎస్సీ కీలక ప్రకటన విడుదల చేసింది. ఫారెస్ట్‌ కాలేజ్‌, రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ములుగులో ప్రొఫెసర్స్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్స్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌ నియామకాలకు సంబంధించి ఇంటర్వ్యూలకు ఎంపికైన వారి జాబితాను ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్‌లో జాబితా అందుబాటులో ఉంచినట్లు సోమవారం తెలిపింది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement