Tuesday, April 23, 2024

International: డ్రోన్ అటాక్‌.. అల్‌ఖైదా కీల‌క నేత‌ అబ్దుల్‌ హమీద్ హ‌తం..

Drone Attack: సిరియాలో డ్రోన్‌ దాడి జ‌రిగింది. ఈ దాడిలో అల్‌ఖైదా కీల‌క నేత‌ అబ్దుల్‌ హమీద్‌ అల్ మతార్ ను హ‌త‌మార్చిన‌ట్టు అమెరికా ప్ర‌క‌టించింది. అత‌డు హ‌తం కావ‌డంతో అమెరికా పౌరులతో పాటు తమ మిత్ర‌ దేశాలు, అమాయక ప్ర‌జ‌ల‌పై అల్‌ఖైదా జరిపే దాడులు కొంతమేర తగ్గే అవకాశం ఉంద‌ని అమెరికా ఆర్మీ మేజర్‌ జాన్ రిగ్స్‌బీ తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా అల్‌ఖైదా జ‌రిపిన‌ దాడుల్లో అబ్దుల్‌ హామీద్‌ అల్ మ‌తార్ కీలక పాత్ర పోషించాడని అమెరికా ఆర్మీ మేజ‌ర్ రిగ్స్‌బీ వివ‌రించారు. ఇటీవ‌ల‌ దక్షిణ సిరియాలోని అమెరికా ఔట్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు దాడులు జ‌రిపారు. దీంతో అమెరికా డ్రోన్ తో ప్ర‌తిదాడి చేసి హ‌మీద్ అల్ మ‌తార్ ను మ‌ట్టుబెట్టిన‌ట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement