Saturday, November 30, 2024

Breaking: జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూ రిమాండ్ ఖైదీగా ఉన్న జానీ మాస్ట‌ర్‌కు రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నేష‌న‌ల్ అవార్డు అందుకోవ‌డం కోసం ఐదు రోజుల మ‌ధ్యంత‌ర బెయిల్ కోరుతూ జానీ మాస్ట‌ర్ త‌రుపు లాయ‌ర్లు పిటీష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై విచార‌ణ చేసిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ఈ నెల 6 నుంచి…
ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు జానీ మాస్టార్ కు రంగారెడ్డి కోర్టు బెయిల్ ఇమంజూరు చేసింది. ఈ నెల 8న ఢిల్లీలో అవార్డు ను జానీ మాస్టర్‌ తీసుకోనున్నారు. బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ధనుష్ నటించిన తిరు సినిమా పాటకు నేషనల్ అవార్డు దక్కింది. ఈ అవార్డు అందుకునేందుకు ఐదు రోజుల పాటు జైలు నుంచి జానీ మాస్ట‌ర్ బ‌య‌ట‌కు రానున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement