Wednesday, April 24, 2024

ఈనెల 15 నుంచి ఇంటర్‌ పరీక్షలు.. సర్వం సిద్ధం చేసిన ఇంటర్‌ బోర్డు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఈనెల 15 నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 9.15 లక్షల మంది విద్యార్థులు హాజరుకాబోతున్నారు. మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 3 వరకు ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు, మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 4 వరకు సెకండియర్‌ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలుంటాయి. పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇంటర్‌ బోర్డు చేపట్టింది. ప్రతీ పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాల నిఘా, సిబ్బంది ను ఏర్పాటు చేసింది. పరీక్ష కేంద్రాలను కూడా సిద్ధం చేసింది. అయితే పరీక్షలు దగ్గర పడుతున్న సందర్భంలో విద్యార్థులు ఒకింత భయానికి, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.

- Advertisement -

అందుకే వారిలో భయాన్ని పోగొట్టేందుకు టెలీ-మానస్‌ అనే స్పెషల్‌ కౌన్సెలింగ్‌ విభాగాన్ని ఇంటర్‌ బోర్డు ఇప్పటికే ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఉండే పరీక్ష భయాన్ని పోగొట్టడానికి ఒక సైకాలజిస్ట్‌ను ఏర్పాటు చేశారు. అందుకు 14416 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. కొంత మంది విద్యార్థులు ఎలాంటి సందర్భంలో చదివినా సరే వారు ప్రశ్నకు సమాధానం తేలికగా రాయగలుగుతారు. కానీ పరీక్షలకు వచ్చే సరికి తడబడతారు. కొంత మందికి ఎంత చదివినా ఆందోళన కారణంగా మెదడులోకి ఎక్కదు. ఇలాంటి విషయాలపట్ల కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు ఇంటర్‌ బోర్డు టోల్‌ఫ్రీ నెంబర్‌ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement