Thursday, April 18, 2024

ఎప్రిల్ లో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు..

హౖౖెదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్: ఇంటర్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ మారే అవకాశం కనబడుతోంది. ఏప్రిల్‌ చివరి వారం నుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షలను నిర్వహించేందుకు ఇంటర్‌ బోర్డు అధికారులు ఆ దిశగా కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్షలను ఏప్రిల్‌ చివరి వారం నుండి మొదలుపెట్టి మే లో పరీక్షలను ముగించేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 6న ఇంటర్‌ బోర్డు 2021-22 అకాడమిక్‌ క్యాలెండర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

అయితే ఇందులో ఇంటర్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను కూడా బోర్డు ఇప్పటికే ప్రకటించింది. పూర్తి స్థాయి షెడ్యూల్‌ను ప్రకటించకున్నా కానీ, మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్‌ 12వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని అందులో స్పష్టం చేసింది. కాగా, ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు గతేడాది కరోనా నేపథ్యంలో రద్దు అయిన నేపథ్యంలో వారికి ఈ ఏడాది మళ్లి పరీక్షలు పెట్టిన విషయం తెలిసిందే. నవంబర్‌ 6వ తేదీ నుంచి స్పాట్‌ వాల్యుయేషన్‌ (పేపర్లు దిద్దే కార్యక్రమం) ఇంకా కొనసాగుతునే ఉంది.

ఈ స్పాట్‌ విధుల్లో చాలా మంది ప్రభుత్వ, కాంట్రాక్టు అధ్యాపకులే హాజరు కావడంతో పిల్లలు తరగతులను కోల్పోతున్నారు. దీని ప్రభావం ప్రైవేట్‌ కాలేజీల్లో చదివే విద్యార్థుల కంటే ప్రభుత్వ కాలేజీల్లో చదివే వారిపైనే ఎక్కువగా పడుతోంది. మరోపైపు ఈ విద్యాసంవత్సరం ప్రత్యక్ష తరగతులు కూడా చాలా ఆలస్యంగానే ప్రారంభమయ్యాయి. ఇలా తరగతులు ఆలస్యంగా ప్రారంభం కావడం, మధ్యలో ఇంటర్‌ పరీక్షలను నిర్వహించడం, స్పాట్‌ వాల్యుయేషన్‌ కోసం ఉపాధ్యాయులు వెళ్లడంతో సిలబస్‌ పూర్తి కావాలంటే ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో ముందస్తు ప్రకటించిన షెడ్యూల్‌ కంటే ఓ నెల రోజులు పరీక్షలను వెనక్కి జరపాలని ఇంటర్‌ బోర్డు భావిస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement