Thursday, April 25, 2024

కొత్త పద్ధతిలో ఇంటర్ మూల్యాంకణం.. మే మొదటి వారంలో ఫలితాలు వెలువడే చాన్స్​

ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 29న విజయవంతంగా ముగిశాయి. 4,17,525 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా.. వీరిలో 4,02,619 మంది పరీక్షలు రాశారు. కాగా, ఇప్పుడు విద్యార్థులు, తల్లిదండ్రులు పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TS BIE) ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ప్రారంభించింది.

వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు బోర్డు అధికారులు యత్నిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మే మొదటి వారంలో ఇంటర్​ ఫలితాలు వెలువడే అవకాశం ఉందని అధికారుల ద్వారా తెలుస్తోంది. ఈ సంవత్సరం స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్.. సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయడానికి ఒక వినూత్న పద్ధతిని ప్రవేశపెట్టింది. దాదాపు 35 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయడానికి ఆన్‌స్క్రీన్ డిజిటల్ మూల్యాంకన విధానాన్ని బోర్డు అమలు చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement