Friday, April 19, 2024

గుట్టుచప్పుడుగా టీచర్ల అంతర్‌జిల్లా బదిలీలు.. మండిపడుతున్న ఉపాధ్యాయ సంఘాలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గుట్టుచప్పుడుగా అంతర్‌ జిల్లా టీచర్ల బదిలీలు చేపడుతున్నారని పలు ఉపాధ్యాయ పంఘాలు ఆరోపిస్తున్నాయి. దొడ్డిదారిన ఫైరవీలకు తెరలేపుతున్నారని మండిపడుతున్నాయి. 317 జీవో అప్పీళ్లు, మ్యూచువల్‌ బదిలీలు, స్పౌజ్‌ బదిలీలు పరిష్కారానికి నోచుకోక ముందే మెడికల్‌ గ్రౌండ్స్‌ లాంటి ఏవో కొన్ని కారణాలు చూపి అంతర్‌జిల్లాల బదిలీలు చేపట్టడాన్ని వారు తప్పుబడుతున్నారు. ఓ ఉపాధ్యాయురాలు సిద్ధిపేట జిల్లా నుంచి మేడ్చల్‌ జిల్లా బదిలీకి సంబంధించి ఉత్తర్వులు వెలువడడాన్ని తప్పుబట్టారు. భార్యభర్తల బదిలీలు, పరస్పర బదిలీల సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement