Tuesday, April 23, 2024

ఓఆర్‌ఆర్‌ లీజుకు తీవ్ర పోటీ! బిడ్లు దాఖలు చేసిన అదానీ, తదితర ఇన్‌ఫ్రా కంపెనీలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాజధాని హైదరాబాద్‌కు మణిహారంగా ఉన్న అవుటర్‌ రింగురోడ్డు(ఓఆర్‌ఆర్‌) దీర్ఘకాలిక లీజు కోసం దేశంలోని ప్రముఖ ఇన్‌ఫ్రా కంపెనీలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఫండ్‌ సంస్థలు పోటీ పడుతున్నాయి. వీటిలో ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలు కేకేఆర్‌తో పాటు కెనడియన్‌ పెన్షన్‌ ఫండ్స్‌ సిపిపి ఇన్వెస్ట్‌మెంట్స్‌( సిపిపిఐబీ)లతోపాటు కేంద్ర ప్రభుత్వ ఇన్‌ఫ్రా సంస్థ ఎన్‌ఐఐఎఫ్‌ కూడా ఉన్నట్లు సమాచారం. 158 కిలోమీటర్ల ఈ రోడ్డు ప్రాజెక్టును హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ రూ. 6 వేల కోట్ల వ్యయంతో నిర్మించింది. 30 సంవత్సరాలు టోల్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌ (టీవోటీ) పద్ధతిలో పూర్తిస్థాయిలో ఈ టోల్‌ రోడ్డును అప్పగించేందుకు నిర్ణయించిన ప్రభుత్వం ఇందుకుగాను బిడ్లను ఆహ్వానించింది. ఈ బిడ్లకు తుది గడువు జనవరి 16 కాగా 28వ తేదీ ఫైనాన్షియల్‌ బిడ్లు ఓపెన్‌ చేసి ఎ క్కువ కోట్‌ చేసిన కంపెనీకి ఓఆర్‌ఆర్‌ను కట్టబెట్టనున్నారు.

వాయిదాల పద్ధతిలో లీజు మొత్తాన్ని చెల్లించనున్న కంపెనీ…

బిడ్లలో ఎక్కువ మొత్తాన్ని కోట్‌ చేసిన కంపెనీకి ఓఆర్‌ఆర్‌ను అప్పగిస్తూ హెచ్‌జీసీఎల్‌ అధికారులు ఫిబ్రవరిలో ఒప్పందం చేసుకోనున్నారు. ఒప్పందం చేసుకునే సమయంలో కోట్‌ చేసిన మొత్తంలో 20 శాతం వరకు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం నిర్ణీత తేదీల్లో వాయిదాలు చెల్లించాల్సి ఉంటుంది. ఒప్పందం జరిగిన తర్వాత అపాయింటెడ్‌ డే నుంచి టోల్‌ రోడ్డు మొత్తం సదురు కంపెనీ ఆధీనంలోకి వెళ్లడంతో పాటు టోల్‌ మొత్తాన్ని ఆ కంపెనీయే వసూలు చేయనుంది.

- Advertisement -

భవిష్యత్తు టోల్‌ ఆదాయంపై కంపెనీల భారీ ఆశలు

భవిష్యత్తు టోల్‌ ఆదాయంపైనే బిడ్లు దాఖలు చేసిన ఇన్‌ఫ్రా కంపెనీలు ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ లాంటి రోజురోజుకు విస్తరిస్తున్న మహా నగరానికి కీలకంగా ఉన్న అవుటర్‌ రింగురోడ్డుపై భవిష్యత్తులో ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగి ఏడాది తర్వాత ఏడాది వచ్చే ఆదాయంలో వృద్ధి చెందడం ఖాయమని కన్సల్టెంట్లు ఇచ్చిన నివేదికల మీద ఆధారంగా కంపెనీలు బిడ్లకు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. రూ.7 వేల కోట్ల వరకు ఓఆర్‌ఆర్‌కు చెల్లించేందుకు కంపెనీలు సిద్ధమైనట్లు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement