Friday, March 29, 2024

గ్రామీణులకు బీమా భరోసా, సీఎస్‌సీతో ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఒప్పందం.. 4లక్షలకు పైగా గ్రామాలకు సేవలు

గ్రామీణ కుటుంబాలకు అవసరమైన బీమా కవరేజీ అందించడానికి, జీవితంపై భరోసా కల్పించడంలో భాగంగా టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కో లిమిటెడ్‌ కీలక ప్రకటన చేసింది. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వ శాఖలో భాగంగా జీవిత బీమా ప్లాన్‌ కోసం కామన్‌ సర్వీసెస్‌ సెంటర్స్‌ (సీఎస్‌సీ)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కో లిమిటెడ్‌ ప్రకటించింది. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న జీవిత బీమా సంస్థల్లో టాటా ఏఐఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కో లిమిటెడ్‌ ఒకటి. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ను అందరికీ వర్తింపజేయాలన్న లక్ష్యంతో 4లక్షలకు పైగా గ్రామ స్థాయి వ్యవస్థాపకులు (విలేజ్‌ లెవల్‌ ఇంటర్‌ప్రెన్యూర్స్‌) నెటవర్క్‌ను తెలియజేస్తుంది. ఈ భాగస్వామ్యంతో టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ దాదాపు 95 శాతం గ్రామ పంచాయతీలకు తమ పరిధిని పెంపొందించుకోవడానికి దోహదం చేస్తుంది. భారతదేశంలోని మారుమూల ప్రాంతాలకు జీవిత బీమాను అందుబాటులోకి తీసుకురావడానికి రోడ్‌లను నిర్మించడానికి అనుమతిస్తుంది.

120 శాతం వార్షిక ప్రీమియం హామీ..

తన నెటవర్క్‌ ద్వారా సీఎస్‌సీ టాటా ఏఐఐ లైఫ్‌ పీఓఎస్‌ స్మార్ట్‌ ఇన్‌కమ్‌ ప్లస్‌ ప్లాన్‌ను అందిస్తుందని సంస్థ చీఫ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసర్‌ వెంకీ అయ్యర్‌ తెలిపారు. ఈ ప్లాన్‌ పొదుపుతో కలిపి.. లైఫ్‌ కవర్‌ ప్రయోజనాన్ని కూడా అందిస్తుందన్నారు. ఈ ప్లాన్‌ రెగ్యులర్‌ ఇన్‌కమ్‌ బెనిఫిట్‌ ఆప్షన్‌ కింద 120 శాతం వార్షిక ప్రీమియం హామీ చెల్లింపులను అందిస్తుందని తెలిపారు. ప్రియమైన వారిని రక్షించడంలో సహాయపడే జీవిత బీమా కవరేజీని అందిస్తుందని పేర్కొన్నారు. ఈ ప్లాన్‌ కింద రూ.24,97,000 బీమా మొత్తాన్ని పొందొచ్చని, 7 ఏళ్ల పాటు ప్రీమియంలు చెల్లించడం ద్వారా.. కస్టమర్‌లు 15 ఏళ్ల పాటు లైఫ్‌ కవర్‌ను పొందుతారని వివరించారు. మహిళా పాలసీదారులు ప్లాన్‌ కోసం అధిక ప్రయోజనాన్ని పొందుతారని, అత్యవసర పరిస్థితుల్లో, వినియోగదారులు పాలసీపై రుణం పొందే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం భారతదేశంలోని గ్రామీణ జనాభాలో జీవిత బీమా వ్యాప్తి 8-10 శాతంగా ఉందని తెలిపారు.

ప్రతీ ఒక్కరికీ బీమా లక్ష్యం..

ప్రతీ భారతీయ కుటుంబానికి జీవిత బీమాను అందుబాటులోకి తీసుకురావడమే తమ నిరంతర ప్రయత్నం అని, ఈ భాగస్వామ్యం మారుమూల ప్రాంతాల్లోని లక్షలాది మంది కస్టమర్‌లకు టెక్నాలజీని, ఉత్పత్తి ఆవిష్కరణల ద్వారా సహాయం చేయడం ద్వారా అందజేసేందుకు ప్రయత్నాలు జరుగుతాయని వెంకీ అయ్యర్‌ అన్నారు. దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న సీఎస్‌సీ టెక్నాలజీ ఎనేబుల్‌ డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ సాయంతో, తాము ఏజెంట్‌ పాత్ర పోషిస్తున్నట్టు వివరించారు. సీఎస్‌ఈ ఈ-గవర్నెన్స్‌ సర్వీస్‌ ఇండియా లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ దినేష్‌ కుమార్‌ త్యాగీ మాట్లాడుతూ.. 2014 నుంచి సీఎస్‌సీ బీమా సేవలను టాటా ఏఐఏ ఇన్సూరెన్స్‌ ద్వారా అందిస్తున్నదని, ఇప్పుడు కొత్తగా ఏఐఏ లైఫ్‌ పీఓఎస్‌ స్మార్ట్‌ ఇన్‌కమ్‌ ప్లస్‌ ప్లాన్‌ తీసుకొచ్చినట్టు తెలిపారు. పొదుపు, రక్షణను లక్ష్యంగా చేసుకుని సేవలు ఉంటాయని, కరోనా మహమ్మారి కారణంగా అంతరాయం ఏర్పడిందని, అది ఆదాయం, ఆరోగ్యం లేదా వ్యాపారాలు కావచ్చని, బీమా పట్ల పౌరుల్లో ఎక్కువ ఆసక్తి ఉందన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement