Friday, March 29, 2024

నాలుగోరోజూ సూచీల నేలచూపులు.. ఐటీ, బ్యాంకింగ్‌ షేర్లు పతనం

ముంబై:స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాలతో మొదలైనప్పటికీ నష్టాలతో ముగిసాయి. వరుసగా నాలుగోరోజూ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సెన్సెక్స్‌ నష్టాలను చవిచూశాయి. గురువారం నిఫ్టీ 28 పాయింట్లు (0.18శాతం) నష్టపోయి 15,938.65వద్ద స్థిరపడింది. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 98 పాయింట్లు (0.18) నష్టపోయి 53,416.15వద్ద స్థిరపడింది. రోజంతా లాభాల్లోకి వెడుతూ, పతనమవుతూ దోబూచులాడిన సెన్సెక్స్‌ ఒక దశలో గరిష్ఠంగా 53,861.28కి చేరి కనిష్టంగా 53,153.77 పాయింట్లను తాకింది. రెండు మార్కెట్లలోనూ ఐటీ, బ్యాంకింగ్‌ షేర్లు పతనమైనాయి.

సెన్సెక్స్‌లో యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు గరిష్టంగా 1.74 శాతం మేర నష్టపోయాయి. ఇక హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, టెక్‌ మహీంద్ర, టీసీఎస్‌, విప్రో ఆల్టాటెక్‌ సిమెంట్స్‌, ఐటీసీ భారీగా నష్టపోయాయి. సన్‌ ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, మారుతి సుజికి ఇండియా, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టైటానా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్ల విలువ పెరగడంతో లాభపడ్డాయి. ఐరోపాలో ఈక్విటీ మార్కెట్‌లో గురువారం మధ్యాహ్నం షేర్ల విక్రయాలు పుంజుకోగా అమెరికా మార్కెట్లు మాత్రం నష్టాలతో ముగిసాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement