Saturday, March 18, 2023

భారతదేశ విలువలు పతనమవుతున్నాయి.. ప్రధాని దేశానికి కాదు, ఆదానికి మాత్రమే: స్పీక‌ర్ పోచారం

నిజామాబాద్, (ప్రభ న్యూస్) : భారతదేశ విలువలు నానాటికి దిగజారిపోతున్నాయని, దేశ ప్రధాని ప్రజలకు జవాబుదారీ కాకుండా ఆదానికి మాత్రమే ప్రధానిగా వ్యవహరిస్తున్నారని అన్నారు తెలంగాణ స‌భాప‌తి పోచారం శ్రీ‌నివాస‌రెడ్డి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం విలేకరులతో ఆయ‌న మాట్లాడారు. తాను సభాపతిగా కాకుండా దేశంలోని ఒక పౌరుడిగా ఈ సందేశాన్ని ఇవ్వాల్సి వస్తుందన్నారు. దేశంలో జరుగుతున్న సంఘటనలు ఇతర దేశాలకు తలదించుకునేలా ఉన్నాయ‌ని, జీడీపీ సగటు ఆదాయం పడిపోవడం దేశంలో రైతుల సమస్యలు పట్టించుకునే నాధుడు కరువయ్యారన్నారు. సంపదను పంచే విధానంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పోచారం శ్రీనివాస్ రెడ్డి కేంద్రం పై నిప్పులు చెరిగారు.

- Advertisement -
   

తనకు రాజకీయాల్లో 47 ఏళ్ల అనుభవం ఉందని, ఏనాడు ఏ ప్రభుత్వం వ్యక్తిగత కక్షలకు పూనుకోలేదన్నారు స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస‌రెడ్డి. దేశంలో బీజేపీ కానీ ప్రతి పార్టీ నాయకులను కక్ష సాధింపు చర్యలకు తెగబడ్డారని ఆవేదన వెలుగుచ్చారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోంద‌న్నారు. మంచిని ఓర్చుకోలేక కేంద్ర ప్రభుత్వం వారి ఆధీనంలో ఉండే సంస్థలను వాడుకొని ఇష్టానుసారంగా బెదిరింపు ధోరణి అవలంబిస్తుందన్నారు. రాష్ట్రాలకు నిధులు అందించడంలో సమానత్వం లోపించిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement