Friday, March 29, 2024

కామన్వెల్త్‌ గేమ్స్ లో భారత్‌ టార్గెట్‌ @100 మెడల్స్‌..

బర్మింగ్‌హామ్‌ వేదికగా జులై 28 నుంచి ప్రారంభం కానున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో వందకు పైగా మెడల్స్‌ సాధించడమే లక్ష్యంగా భారత క్రీడాకారులు బరిలో దిగుతున్నారు. 2010లో న్యూఢిల్లిd వేదికగా జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో 100 మెడల్స్‌ మార్క్‌కు చేరిన విషయం తెలిసిందే. అదే స్ఫూర్తితో భారత క్రీడాకారులు తమ ప్రతిభా పాటవాలను, నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ వస్తున్నారు. పలు అంతర్జాతీయ టోర్నీల్లో అద్భుతంగా రాణిస్తూ మెడల్స్‌ సాధిస్తున్న విషయం తెలిసిందే. 2014 గ్లాస్గో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ 64 మెడల్స్‌ చేజిక్కించుకుంది. ఇందులో 15 గోల్డ్‌, 30 సిల్వర్‌, 19 బ్రోంజ్‌ మెడల్స్‌తో పతకాల పట్టికలో భారత్‌ 5వ స్థానంలో నిలిచింది. 2018లో ఆస్ట్రేలియాలోని గోల్డ్‌ కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌తో భారత బృందం 66 మెడల్స్‌ సాధించి, పతకాల పట్టిక మూడో స్థానంలో నిలిచింది. 26 గోల్డ్‌ మెడల్స్‌, 20 సిల్వర్‌, 20 బ్రోంజ్‌ పతకాలు సాధించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌కు భారత్‌ నుంచి 215 మంది క్రీడాకారులు అర్హత సాధించారు. భారత్‌కు అత్యధికంగా మెడల్స్‌ సాధించే షూటింగ్‌ ఈవెంట్స్‌ను బర్మింగ్‌హామ్‌ సీడబ్ల్యూజీ నుంచి తొలగించారు. ఇది భారత్‌కు తీవ్ర నిరాశ పరిచే అంశం. భారత్‌కు పతకాల వచ్చే క్రీడాంశాల వారీగా పరిశీలిస్తే… అథ్లెటిక్స్‌లో జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా, దూతీ చాంద్‌, హిమ దాస్‌ ఉన్నారు. షాట్‌ పుట్టర్‌ తజిందర్‌పాల్‌ సింగ్‌ గాయంతో కామన్వెల్త్‌ గేమ్స్‌ నుంచి వైదొలగాడు. హైజంప్‌లో తేజస్విన్‌ శంకర్‌ ఆశలున్నాయి. బ్యాడ్మింటన్‌లో నాలుగు గోల్డ్‌ మెడల్స్‌ సాధించే అవకాశాలున్నాయి. పీవీ సింధు, లక్ష్య సేన్‌, కిదాంబి శ్రీకాంత్‌, సాత్విక్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టిలపై ఎన్నో ఆశలున్నాయి. బాక్సింగ్‌ విషయానికొస్తే… తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌పై గోల్డ్‌ మెడల్‌ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిఖత్‌తోపాటు వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌ సిల్వర్‌ మెడలిస్ట్‌ అమిత్‌ పంగల్‌, ఒలింపిక్‌ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహెన్‌, ఆసియన్‌ చాంపియన్‌షిప్‌ గోల్డ్‌ మెడల్‌ విన్నర్‌ సంజీత్‌ కుమార్‌లు స్వర్ణ పతకాలు సాధించే అవకాశాలున్నాయి. శివ థప, మొహమ్మద్‌ హుసముద్దీన్‌పై ఆశలున్నాయి. ఇక టేబుల్‌ టెన్నిస్‌లో మణిక బత్రా గత సీడబ్ల్యూజీలో గోల్డ్‌ మెడల్‌ సాధించింది. ఈ సారి బత్రాతోపాటు సాథియన్‌ గణశేఖరన్‌ లేదా శరత్‌ కమల్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించే అవకాశాలున్నాయి. వెయిట్‌లిఫ్టింగ్‌లో ఒలింపిక్‌ సిల్వర్‌ మెడలిస్ట్‌ సాయిఖోమ్‌ మీరాబాయ్‌ చాను ముందు వరుసలో ఉంది. 2021 వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌ గోల్డ్‌ మెడల్‌ విన్నర్‌ బింద్యారాణి, 9వ ర్యాంక్‌డ్‌ గురురాజ పూజరి కూడా రాణించే అవకాశాలున్నాయి. 2018 సీడబ్ల్యూజీలో గోల్డ్‌ విన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ కూడా ఈసారి పతకం తీసుకొస్తానని ధీమాతో ఉన్నారు. రెజ్లింగ్‌లో టోక్యో ఒలింపిక్స్‌ మెడల్‌ విన్నర్స్‌ రవి కుమార్‌ దహియా, బజ్‌రంగ్‌ పునియాలపై భారీ ఆశలున్నాయి. రియో గేమ్స్‌లో కాంస్య పతకాలు సాధించిన దీపక్‌ పునియా, వినేశ్‌ పొగట్‌ కూడా బరిలో ఉన్నారు. సాక్షి మాలిక్‌, 2021 ఆసియన్‌ చాంపియన్‌షిప్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ దివ్య కక్రన్‌లు గోల్డ్‌ మెడల్స్‌ సాధిస్తారని ఆశలున్నాయి. ఇవే కాగా, క్రికెట్‌, హాకీ, స్క్వాష్‌ల్లోనూ స్వర్ణ, రజత, కాంస్య పతకాలు భారత క్రీడాకారులు సాధించే అవకాశాలున్నాయని అభిమానాలు ధీమాతో ఉన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement