Saturday, March 23, 2024

బహుళత్వంలో ఏకత్వమే భారత తత్వం.. ఢిల్లీ పర్యటనలో ఏపీ గవర్నర్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : బహుళత్వంలో ఏకత్వమే భారత సమాజ తత్వమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. మంగళవారం న్యూఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో నిర్వహించిన ఇండియన్ మైనారిటీస్ ఫౌండేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ సామరస్యత సాధనమైన రాజ్యాంగం జాతి, కుల, మత వివక్ష లేకుండా అందరికీ ప్రాథమిక హక్కులను సమానంగా అందించిందన్నారు.

ప్రతి ఒక్కరి ప్రాథమిక అవసరాలు తీర్చడంతో మొదలు ‘సబ్ కా సాత్ – సబ్ కా వికాస్ – సబ్ కా విశ్వాస్ – సబ్ కా ప్రయాస్’ అనే సమతా నినాదంతో యావద్భారత సమగ్ర, సంపూర్ణాభివృద్ధికి ప్రధాని పాటుపడుతున్నారని కొనియాడారు. అల్ పసంఖ్యాకులు వివిధ రంగాలలో అత్యున్నత స్థానాలను అధిరోహించారని అబ్దుల్ నజీర్ కొనియాడారు.

- Advertisement -

అబుల్ కలాం ఆజాద్, అబ్దుల్ కలాం, ఉస్తాద్ బిస్మిల్లాహ్ ఖాన్, హోమీ భాభా, జె.ఆర్.డి టాటా, శామ్ మానెక్షా తదితరులు దేశానికి చేసిన సేవల వల్ల ఆదర్శప్రాయులుగా, చిరస్మరణీయులుగా నిలిచారని చెప్పారు. ఉగ్రవాదం – అభద్రత – అశాంతి, వెనుకబాటుతనానికి కారణకారకాలని అవి ఉన్న చోట అభివృద్ధి అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement