Thursday, April 18, 2024

షూటింగ్ కోసం గంటికోటకు చాపర్ లో వచ్చి వెళ్తున్న.. కమల్ హాస‌న్

సినిమా షూటింగ్ కోసం తిరుపతి నుంచి గంటికోటకు చాపర్ లో వచ్చి వెళ్తున్నారు స్టార్ న‌టుడు కమల్ హాస‌న్. భారతీయుడు 2 షూటింగ్ జ‌రుగుతోంది.ఈ చిత్రంలో కమల్ హాసన్‌కు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరణ్‌తో కలిసి ఉదయనిధి స్టాలిన్‌ నిర్మిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ రాయలసీమలో జరుగుతోంది. కడప జిల్లా గండికోటలో వేసిన ప్రత్యేక సెట్‌లో బ్రిటీష్‌ కాలం నాటి సన్నివేశాలు తీస్తున్నారు. కూరగాయలు, పశువుల అమ్మకాలు జరుగుతున్న మార్కెట్‌పై బ్రిటీష్ పోలీసులు దాడి చేస్తుంటే, కమల్ హాసన్ వారిని ఎదుర్కునే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. బిగ్ బాస్ తమిళ సీజన్ 6 షూటింగ్‌ను ముగించిన తర్వాత కమల్ హాసన్ ఇప్పుడు పూర్తిగా చిత్రంపైనే దృష్టి సారించారు. కమల్ హాసన్ ప్రతి రోజు తిరుపతి నుంచి హెలికాప్టర్‌లో షూటింగ్ కోసం గండికోటకు వచ్చి వెళ్తున్నారు. కమల్ తో పాటు ఆయన స్టైలిస్ట్ అమృత రామ్ కూడా ఇందులోనే ప్రయాణిస్తున్నారు. కమల్ చాపర్ లో స్పాట్ కు వచ్చిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement