Friday, April 19, 2024

క‌మ‌ల్ హాస‌న్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్- భార‌తీయుడు2 షూటింగ్ స్టార్ట్

ఎన్నో వివాదాల‌తో నిలిచిపోయిన చిత్రం భార‌తీయుడు-2. భార‌తీయుడికి సీక్వెల్ గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. కాగా ఎట్ట‌కేల‌కు భార‌తీయుడు2 షూటింగ్‌ గురువారం ప్రారంభమైనట్లు విశ్వ‌న‌టుడు కమల్ హాసన్‌ అధికారంగా ప్రకటించారు. అంతేకాకుండా ద‌ర్శ‌కుడు శంకర్‌తో షూటింగ్‌ స్పాట్‌లో దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌, రెడ్‌జియాంట్‌ మూవీస్‌ బ్యానర్‌లపై ఏ.సుభాస్కరణ్‌, ఉదయనిధి స్టాలిన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కమల్‌కు జోడీగా కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఏ.ఆర్‌ రెహమాన్‌ స్వర కల్పనలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది ద్వితియార్థంలో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దాంతో క‌మ‌ల్ హాస‌న్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement