Friday, April 19, 2024

చైనాలో ఇండియన్‌ వైెద్య విద్యార్థి మృతి.. చెన్నైకి చెందిన అబ్దుల్‌ షేక్‌గా గుర్తింపు

చైనాలో వైద్య విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థి అబ్దుల్‌ షేక్‌ మృతిచెందాడు. అనారోగ్యంతో బాధపడుతున్న అబ్దుల్‌ ఆదివారం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటర్న్‌షిప్‌లో ఐదు సంవత్సరాలుగా చైనాలో వైద్య విద్యను అభ్యసిస్తున్నాడు. ఈ సంవత్సరంతో విద్యా సంవత్సరం పూర్తి కానుంది. ఇటీవల డిసెంబర్‌లో స్వస్థలం చెన్నైకి వచ్చిన అబ్దుల్‌ .. డిసెంబర్‌ 11న చైనాకు చేరుకున్నాడు. కోవిడ్‌ నిబంధనల ప్రకారం ఐసోలేషన్‌ అనంతరం కికిహర్‌ వర్శిటీకి చేరుకున్నాడు.

ఇటీవల అనారోగ్యానికి గురైన అబ్దుల్‌ కోలుకోలేక మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తమ కుమారుడి శవాన్ని స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని విదేశాంగశాఖ మంత్రిని అభ్యర్థించారు. తమిళనాడు ప్రభుత్వం కూడా విదేశాంగశాఖకు లేఖ రాసింది. అబ్దుల్‌ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞపి చేసింది. అబ్దుల్‌ చైనాలోని ఉత్తర వాయువ్యం లోని హెలిగాన్‌ ప్రావిన్స్‌ వద్ద ఖిఖిహర్‌ వర్శిటీలో వైద్య విద్యను అభ్యసిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement