Thursday, April 18, 2024

బిగ్ బాస్ సీజన్ లో ఇండియన్ ఐడల్ విన్నర్!

అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ కు సంబంధించిన హౌస్ సెట్టింగ్ కూడా పూర్తయిపోయింది. కొన్ని రోజుల క్రితమే ప్రోమోనూ విడుదల చేశారు. కంటెస్టెంట్లను ఎంపిక చేస్తున్నారు. సరయూ, విశ్వ, కొరియోగ్రాఫర్ నటరాజ్, యానీ మాస్టర్, యాంకర్ రవి, లోబో, మానస్, వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్, ట్రాన్స్ జెండర్ ప్రియాంక, ఉమా దేవి, వర్షిణి, లహరి శ్రీ, ఆర్జే కాజల్ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఈ షోలో ఇండియన్ ఐడల్ విజేత శ్రీరామ్ చంద్ర ఓ కంటెస్టెంట్ గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

ప్రతి సీజన్ లోనూ ఓ సింగర్ ను హౌస్ లోకి పంపించేలా బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేశారు. గతంలో గీతా మాధురి, రాహుల్ సిప్లిగంజ్ లాగానే ఈసారి శ్రీరామ చంద్రను ఎంపిక చేశారని సమాచారం. అయితే, దీనిపై మాత్రం సింగర్ శ్రీరామ చంద్ర ఇంకా అధికార ప్రకటన చేయలేదు. గతంలో ఇండియన్ ఐడల్ గా నిలిచి తన గాత్రంతో అందరి మనసులను కొల్లగొట్టేసిన ఈ శ్రీరామ్.. బిగ్ బాస్ హౌస్ లో కాలు పెడుతున్నాడా? లేదా? అనేది తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement