Friday, April 26, 2024

కల్పాక్కమ్‌ డచ్‌ పోర్టులో.. ఇండియ‌న్2 షూటింగ్

విశ్వ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాడు.ఆయ‌న న‌టిస్తోన్న చిత్రాల్లో ఇండియన్ 2 కూడా ఒక‌టి.ఈ మూవీ షూటింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం తమిళనాడులోని కల్పాక్కమ్‌ డచ్‌ పోర్టులో షూటింగ్ కొనసాగుతోంది. విశ్వ‌న‌టుడు కమల్ హాసన్‌తో పాటు ఇతర యాక్టర్లపై వచ్చే కీలక యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తుండగా.. తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితులైన బాబీ సింహా, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, స‌ముద్రఖని ఇత‌ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఇండియ‌న్ 2 చిత్రాన్ని శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నాడు.కమల్‌ హాసన్‌ నటించిన విక్రమ్‌ చిత్రానికి అదిరిపోయే మ్యూజిక్‌, బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ అందించిన అనిరుధ్ ర‌విచంద‌ర్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌‌. కాగా లైకా ప్రొడక్షన్స్-రెడ్ జియాంట్ మూవీస్ బ్యానర్లపై ఉద‌య‌నిధి స్టాలిన్‌-సుభాస్కరన్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement