Friday, March 29, 2024

చెపాక్ లో దెబ్బ‌కొట్టిన భార‌త్ – 317 ప‌రుగుల తేడాతో ఇంగ్లండ్ ఘోర‌ప‌రాజ‌యం..

చెన్నై: చెపాక్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమ్‌ఇండియా ఘ‌న‌ విజయం సాధించింది. 482 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్‌ 317 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్‌తో జ‌రిగిన తొలి టెస్టులో ఘోరంగా ఓడిపోయిన టీమిండియా చెన్నైలో జ‌రిగిన‌ రెండో టెస్టులో క‌సి తీర్చుకుంది. భార‌త బౌల‌ర్లు అక్ష‌ర్ ప‌టేల్, ర‌విచంద్ర‌న్ అశ్విన్ బౌలింగ్‌ ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఎవ‌రూ క్రీజులో నిల‌దొక్కుకోలేక‌పోయారు. తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీసిన అక్ష‌ర్ ప‌టేల్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి జ‌ట్టు గెలుపులో కీల‌క పాత్ర పోషించాడు.
అలాగే, తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు ఐదు వికెట్లు ప‌డ‌గొట్టిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు ప‌డ‌గొట్టి ఇంగ్లండ్‌ను దెబ్బ‌తీశాడు. వారికి తోడు రెండో ఇన్నింగ్స్‌లో కుల్‌దీప్ యాద‌వ్ రెండు వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ 329, రెండో ఇన్నింగ్స్‌లో 286 ప‌రుగులు చేంది. ఇక‌. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 134, రెండో ఇన్నింగ్స్‌లో 164 ప‌రుగులు చేసింది.
రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో బ‌ర్న్స్ 25, సిబ్లీ 3, లారెన్స్ 26, జాక్ లీచ్ 0, కెప్టెన్ రూట్ 33, బెన్ స్టోక్స్ 8, పోప్ 12, బెన్ ఫోక్స్ 2 , మోయీన్ అలీ 43, స్టోన్ 0, బ్రాడ్ 5 ప‌రుగులు చేశారు. రెండో ఇన్నింగ్స్ భార‌త్ స్పిన్న‌ర్స్ మొత్తం 10 వికెట్లు తీయ‌డం విశేషం..

Advertisement

తాజా వార్తలు

Advertisement