Friday, April 19, 2024

మొద‌టిస్థానంలో హిమాచ‌ల్ ప్ర‌దేశ్..

కరోనా మహమ్మారిని అడ్డుకోవాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే అందరిముందున్న దారి..దీనికోసం ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపుగా దేశంలో మొత్తం 38.50 కోట్ల మంది ప్ర‌జ‌లు టీకాలు తీసుకున్న‌ట్టు ఆరోగ్య‌శాఖ తెలియ‌జేసింది. అయితే, దేశంలో అత్య‌ధిక వ్యాక్సినేష‌న్ అందించిన రాష్ట్రాల్లో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ మొద‌టిస్థానంలో ఉన్న‌ది.  హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో 18 ఏళ్లు దాటిన వారిలో 61.1శాతం మందికి వ్యాక్సిన్ అందించింది.  హిమాచ‌ల్ ప్ర‌దేశ్ మొద‌టి స్థానంలో ఉంటే, దేశ రాజ‌ధాని ఢిల్లీ రెండో స్థానంలో ఉన్న‌ది.  ఢిల్లీలో 45.4 శాతం మంది జ‌నాభాకా మొద‌టి డోస్ వ్యాక్సిన్ పూర్తి చేశారు.  44.4 శాతం వ్యాక్సినేష‌న్‌తో గుజ‌రాత్ మూడో స్థానంలో ఉంది. ఇక టీకాలు వేసే విష‌యంలో పెద్ద రాష్ట్రాలైన యూపీ, బీహార్ ఉన్నాయి.  బీహార్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 22 శాతం మంది జ‌నాభాకు మాత్ర‌మే వ్యాక్సిన్ వేయ‌గా, యూపీలో 21.5 శాతం మంది జనాభాకు మాత్ర‌మే వ్యాక్సిన్ వేశారు.

ఇది కూడా చదవండి: మావోయిస్టులూ లొంగిపోండి.. తెలంగాణ డీజీపీ సూచన

Advertisement

తాజా వార్తలు

Advertisement