Sunday, October 17, 2021

దేశంలో కొత్తగా 18,132 కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కొత్తగా 18,132 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, 193 మంది మరణించారు. మరో 21,563 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,39,71,607కు చేరింది. ఇందులో 3,32,93,478 కరోనా నుంచి బయటపడగా, 2,27,347 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు.

ఇప్పటివరకు 4,50,782 మంది కరోనా మహమ్మారి వల్ల మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 10,691 కేసులు ఉన్నాయని, రాష్ట్రంలో కొత్తగా 85 మంది మరణించారని తెలిపింది. ఇక దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు 95,19,84,373 టీకా డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News