Wednesday, September 20, 2023

వైద్య, ఆరోగ్యరంగంలో అగ్రభాగాన భారత్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వైద్య, ఆరోగ్యరంగంలో దేశాన్ని అగ్రభాగాన నిలిపేందుకు ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రపంచమంతా సంతోషంగా ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండాలన్నదే ప్రధాని ఆలోచన అన్నారు. భారత్‌ తన గురించే కాకుండా ప్రపంచ ప్రజల ఆరోగ్యం గురించి కూడా ఆలోచిస్తుందన్నారు. హైదరాబాద్‌లో జీ 20 హెల్త్‌ వర్కింగ్‌ గ్రూప్‌నకు సంబంధించి మూడో సమావేశానికి ఆదివారం ఆయన హాజరై మాట్లాడారు. ప్రపంచానికే హైదరాబాద్‌ ఫార్మసీ, వ్యాక్సిన్‌ రాజధాని అని చెప్పారు. నాణ్యమైన వైద్య విధానాలు భారత్‌లో శతాబ్ధాల క్రితమే ఉన్నాయన్నారు.

ఆయుర్వేదం 5వేల ఏళ్ల నాటి వైద్యమని, ఆయుర్వేదం ఆరోగ్యవంతమైన, సుదీర్ఘ జీవితానికి ఉపయోగపడుతుందన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని యోగా పెంపొదిస్తుందన్నారు. ఆయుర్వేదం, సిద్ధ, యునానీ, యోగా వంటి వైద్య ప్రక్రియలు శతాబ్దాల క్రితమే ఉన్నాయన్నారు. హెల్త్‌ టూరిజంలో టాప్‌ 10 దేశాల్లో భారత్‌ ఒకటని, వ్యాక్సిన్లలో 33శాతం భారత్‌లోనే తయారువుతున్నాయన్నారు. 2030 నాటికి యూనివర్సిల్‌ హెల్త్‌ క ఏర్‌ కవరేజ్‌ని సాధించాలని కృషి చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -
   

మెడికల్‌ వ్యాల్యూ ట్రావెల్‌కు భారత్‌ను ఒక కొత్త హబ్‌గా మార్చాలన్నదే ప్రధాని మోడీ లక్ష్యమన్నారు. అందుబాటులో ఆరోగ్య సేవలు, మందులు, నాణ్యమైన ఆరోగ్యసంరక్షణా విధానాలు, కొత్త పరిశోధనలకు భారత్‌ కేంద్రం కాబోతోందన్నారు. కరోనా సమయంలో ఇండియా ఫార్మసీ ఆఫ్‌ ద వరల్డ్గా నిలిచిందని గుర్తు చేశారు. హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీ 33శాతం వ్యాక్సిన్‌ ఉత్పత్తి కేంద్రంగా నిలిచిందని ప్రశంసించారు. వసుదైక కుటుంబం అనే జీ20థీమ్‌కు ఇది సరిగ్గా సరిపోతుందన్నారు. ఈ సందర్భంగా ఒడిశా రైలు ప్రమాద మృతులకు సంతాపం తెలిపారు.

యువశక్తితోనే భవ్యమైన భారత్‌ నిర్మాణం…

హైదరాబాద్‌లో కౌశల్‌యోజన లో భాగంగా జాబ్‌ మేళా 1300మందికి నియామక పత్రాలు ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ యువశక్తితో భవ్యమైన భారతదేశాన్ని నిర్మించేందుకు కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే అన్ని రంగాల్లో యువతను భాగస్వామ్యం చేస్తూ వినూత్నమైన, సృజనాత్మకమైన మార్పులను తీసుకువస్తోందన్నారు. దేశంలో, రాష్ట్రంలో యువతలో శక్తి సామర్థ్యాలు అపారంగా ఉన్నాయన్నారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌ విద్యానగర్‌లో జరిగిన మెగా జాబ్‌మేళా ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ జాబ్‌మేళాలో 1300 మంది అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా నిపుణ స్వచ్ఛంద స ంస్థతో కలిసి నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ ఈ జాబ్‌మేళాలను నిర్వహిస్తోందన్నారు. ఇప్పటి వరకు నైపుణ్యాభివృద్ధి ద్వారా కోటి 25లక్షల మందికి నైపుణ్య శిక్షణ అందించినట్లు తెలిపారు. ఆదివారం నాటి జాబ్‌మేళాలో 15వేల మంది రిజిస్ట్రేషన్‌ చేయించుకోగా 5వేల మంది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారని తెలిపారు. 5వేల మందిలో 1300మందికి ఉద్యోగ పత్రాలను తన చేతుల మీదుగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement