Friday, April 19, 2024

భారత్‌.. డిజిటల్‌ హబ్‌.. భారీ పెట్టుబడులకు యోచన : గూగుల్‌ సీఈఓ సుందర్‌

భారత్‌లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించినట్టు గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ప్రకటన చేశారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు గూగుల్‌ కృషి చేస్తుందన్నారు. రాబోయే కాలంలో భారత్‌ అతిపెద్ద డిజిటల్‌ హబ్‌గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డిజిటలైజేషన్‌ కోసం కంపెనీ గత సంవత్సరం 10 బిలియన్లు (సుమారు రూ.75,000 కోట్లు) పెట్టుబడిని ప్రకటించింది. భారత్‌ నుంచి ప్రపంచ అవసరాలు తీరే పరిస్థితులు వస్తాయని చెప్పుకొచ్చారు. డిజిటల్‌ ఇండియాలో తామూ భాగస్వామ్యం అవుతున్నట్టు ప్రకటించారు. ఇందులో భాగంగా భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. తమ కంపెనీ కీలక ఉత్పత్తులను భారత్‌లో మరిన్ని తయారు చేస్తుందన్నారు. ఇది ప్రపంచ స్థాయిలో తనకు సహాయపడుతుందని చెప్పుకొచ్చారు.

యూట్యూబ్‌పై నజర్‌..

భారత్‌లో యూట్యూబ్‌పై ఎక్కువ దృష్టిపెట్టాలని పిచాయ్‌ తెలిపారు. భారత్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా కంపెనీకి యూట్యూబ్‌ షార్ట్‌లు చాలా ముఖ్యమైనవి అని తెలిపారు. యూట్యూబ్‌ భారత్‌లో ఇప్పటి వరకు 5 ట్రిలియన్‌ల ఆల్‌ టైమ్‌ వీక్షణలను సాధించిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రోజుకు 15 బిలియన్ల కంటే ఎక్కువ వీక్షణలను పొందుతోందన్నారు. 2022లో గూగుల్‌ సెర్చ్‌, గూగుల్‌ మ్యాప్‌, యూట్యూబ్‌లో కొత్త ఫీచర్లను చేర్చనున్నట్టు పిచాయ్‌ తెలిపారు. వీటిని ప్రజలు మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దనున్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా మిగిలిన దేశాలకు సహాయపడుతుందన్నారు. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్స్‌లో గూగుల్‌ మరింత ఎక్కువ పెట్టుబడి పెట్టనుంది. తద్వారా దేశంలో ఎక్కువ మంది ప్రజలు ఇంటర్నెట్‌ను సులభంగా ఉపయోగించుకోగలరు.

ఎయిర్‌టెల్‌తో గూగుల్‌ ఒప్పందం..

5జీకి సంబంధించి ఇటీవల గూగుల్‌, భారతీ ఎయిర్‌టెల్‌ చేతులు కలిపాయి. ఎయిర్‌టెల్‌లో గూగుల్‌.. 100 మిలియన్‌ డాలర్లు (రూ.7,510కోట్లు) పెట్టుబడి పెట్టనుంది. ఇందులో గూగుల్‌, భారతీ ఎయిర్‌టెల్‌లో 700 మిలియన్‌ (రూ.5257) వాటాను కొనుగోలు చేస్తుంది. వీరు కలిసి చౌక ఫోన్‌లను అభివృద్ధి చేయనున్నారు. ఎయిర్‌టెల్‌లో 1.28 శాతం వాటాను ఒక్కో షేరుకు రూ.734 చొప్పున గూగుల్‌ కొనుగోలు చేయనుంది. మిగిలిన 300 మిలియన్‌ డాలర్లు (రూ.2253 కోట్లు) కొన్నేళ్ల పాటు వాణిజ్య ఒప్పందాల రూపంలో పెట్టుబడి పెడ్తారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement