Saturday, April 20, 2024

India Corona | దేశంలో తగ్గుముఖం పట్టిన కొవిడ్‌ వ్యాప్తి.. కొత్త కేసులు ఎన్నంటే?

దేశంలో క‌రోనా వ్యాప్తి త‌గ్గుముఖం ప‌ట్టింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కొవిడ్ వ్యాప్తికి సంబంధించిన వివ‌రాల‌ను వెల్ల‌డించింది. గ‌డిచిన 24 గంటల వ్యవధిలో 1,23,395 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 535 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,49,88,426కి చేరింది. ప్రస్తుతం దేశంలో 6,168 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మహమ్మారి నుంచి ఇప్పటి వరకు 4,44,50,404 మంది కోలుకున్నారు. ఇక 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,31,854కి ఎగబాకింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement