Thursday, April 25, 2024

India Corona : దేశంలో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు.. కొత్త‌గా 89 మందికి పాజిటివ్…

ప్రపంచాన్ని మరోసారి కొవిడ్‌ భయాలు చుట్టుముట్టినప్పటికీ.. భారత్‌లో మాత్రం మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. చైనాలో గ‌త కొంత‌కాలంగా క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తుండ‌గా.. ప‌క్క‌నే ఆనుకుని ఉన్న భార‌త్ లో కూడా పంజా విసురుతుంద‌ని నిపుణులు భావించారు. భార‌త్ జ‌నాభా సైతం కోట్ల‌లో ఉండ‌డంతో కేంద్రం ప్ర‌జ‌ల‌ను అల‌ర్ట్ చేసింది. అయినా భార‌త్ లో క‌రోనా ప్ర‌భావం అంత‌గా అంత‌గా చూప‌లేదు. దీంతో ప్ర‌జ‌లు ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా దేశంలో ఎన్న‌డూ లేని విధంగా కరోనా వైరస్‌ కేసులు మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,63,342 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 89 మందికి పాజిటివ్‌గా తేలింది. మార్చి 27వ తేదీ 2020 తర్వాత ఇంత తక్కువ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 4,46,81,233కి చేర‌గా.. ప్రస్తుతం దేశంలో 2,035 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, మూడు రోజులుగా దేశంలో ఎలాంటి కరోనా మరణాలు సంభవించలేదు. ప్రస్తుతం మరణాల సంఖ్య 5,30,726 వద్ద కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement