Thursday, March 28, 2024

దేశంలో స్థిరంగా కొనసాగుతోన్న కరోనా కేసులు..

దేశవ్యాప్తంగా కరోనా అదుపులోకి వచ్చినట్లే వచ్చి మళ్లీ చాపకింద నీరులా విజృంభిస్తోంది. మొన్నటి వరకు 40 వేలకు దిగువకు వచ్చిన కేసులు ఇప్పుడు 40 వేలు పై చిలుకు స్థిరంగా నమోదవుతున్నాయి… తాజాగా గత 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. నిన్న దేశంతో 42,015  క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,12,16,337కు చేరింది. అలాగే, నిన్న 36,977 మంది కోలుకున్నారు. మరణాల విషయానికొస్తే… నిన్న‌ 3,998 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,18,480కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,03,90,687  మంది కోలుకున్నారు. 4,07,170 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 41,54,72,455 వ్యాక్సిన్ డోసులు వేశారు.  కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 44,91,93,273 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. నిన్న 18,52,140 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

ఇది కూడా చదవండి: రెండో వన్డేలో టీమిండియా విజయం..2-0 తో సిరీస్ కైవసం

Advertisement

తాజా వార్తలు

Advertisement