Friday, April 19, 2024

భారత్​, న్యూజిలాండ్​ వన్డే సిరీస్​.. రేపే క్రెస్ట్‌ చర్చ్‌లో చివరి మ్యాచ్‌

భారత్‌ న్యూజిలాండ్‌ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో మూడోది బుధవారం జరగనుంది. క్రెస్ట్‌ చర్చ్‌లో చివరి మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని శిఖర్‌ ధావన్‌ జట్టు భావిస్తోంది. అక్లాండ్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో కివీస్‌ ఏడువికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. కాగా హామిల్టన్‌ వేదికగా జరగాల్సిన రెండో మ్యాచ్‌ వర్షార్పణమైంది. క్రెస్ట్‌ చర్చ్‌ లోని హగ్లీ మైదానంలో భారత జట్టు వన్డే ఆడటం ఇదే తొలిసారి. ఈ మైదానంలో భారత్‌కు మ్యాచ్‌ గెలవడం అంత సులువు కాదు. హగ్లీ ఓవల్‌లో జరిగిన

వన్డేల్లో న్యూజిలాండ్‌కు గొప్ప రికార్డు ఉంది.

కివిస్‌ జట్టు ఇప్పటివరకు ఇక్కడ 11 వన్డేలు ఆడగా అందులో పది మ్యాచుల్లో గెలిచి ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయింది. న్యూజిలాండ్‌ ఈ మైదానంలో చివరిసారిగా 2018లో ఓడిపోయింది. ఇంగ్లండ్‌ 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించింది. హగ్లీ ఓవల్‌లో మొత్తం 15 వన్డేలు జరిగాయి. వీటిలో నాలుగు మ్యాచ్‌లు న్యూజిలాండ్‌ జట్టు ప్రమేయం లేకుండా ఉన్నాయి. కివీస్‌ జట్టు సాధించిన ఈ పటిష్ట రికార్డు చూస్తుంటే భారత్‌కు మ్యాచ్‌ గెలవడం అంత సులువు కాదు.

- Advertisement -

న్యూజిలాండ్‌ ముందంజ

ఇరు దేశాల మధ్య జరుగుతున్న వన్డే సిరిస్‌లో న్యూజిలాండ్‌ 1-0 ఆధిక్యంలో ఉంది. అక్లాండ్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో కివీస్‌ 7 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 7 వికెట్లకు 306 పరుగులు చేసింది. 307 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు మూడు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేధించింది.
న్యూజిలాండ్‌ తరపున టామ్‌ లాథమ్‌ అజేయంగా 145 పరుగులు చేశాడు. కాగా కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ 94 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆ తర్వాత హమిల్టన్‌ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో వర్షం పడింది. రెండో మ్యాచ్‌లో తొలుత ఆడిన భారత్‌ 12.5 ఓవర్లలో ఒక వికెట్‌ న ష్టానికి 89 పరుగులు చేసింది.

వానగండం

క్రెస్ట్‌ చర్చ్‌లో రేపు ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై ఉంటుందని, మ్యాచ్‌ సమయానికి భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశముందని వెదర్‌ ప్రిడిక్షన్‌లో వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement