Monday, December 9, 2024

IND vs SA | తొలి టీ20 మ‌న‌దే.. !

డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టును చిత్తు చేసిన సూర్య సేన… 61 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. ఇక‌ ఈ విజయంతో నాలుగు మ్యాచ్ ల టీ20ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

కాగా, ఈ మ్యాచ్ లో 203 పరుగుల భారీ టార్గెట్ తో చేజింగ్ కు దిగిన సఫారీలు… నిర్ణీత ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట‌య్యారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ (25), గెరాల్డ్ కోయెట్జీ (23), ర్యాన్ రికెల్టన్ (21)లు టాప్ స్కోరర్లుగా నిలిచారు.

భార‌త బౌల‌ర్ల‌లో వరుణ్ చక్రవర్తి (3/25), రవి బిష్ణోయ్ (3/28) వికెట్ల‌తో చెల‌రేగారు. ఇక అవేష్ ఖాన్ రెండు వికెట్లు తీయ‌గా… అర్షదీప్ సింగ్ ఒక్క వికెట్ ద‌క్కించుకున్నాడు. దీంతో స‌ఫారీల జ‌ట్టు 17.5 ఓవ‌ర్ల‌లోనే ఆలౌట్ అయ్యింది. ఇక దక్షిణాఫ్రికా – భారత్ మధ్య రెండో టీ20 మ్యాచ్ ఆదివారం (నవంబర్ 10) గెబెర్హా వేదికగా జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement