Thursday, March 28, 2024

Ind vs Ban 3rd ODI : ఇషాన్‌ కిషన్‌ విశ్వరూపం… 103 బంతుల్లో 150 ప‌రుగులు..

బంగ్లాదేశ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో భారత్ బ్యాట్స్ మెన్ ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. సీనియ‌ర్ల‌ను త‌ల‌ద‌న్నేలా అత‌డి ఆట‌తీరు ఉంద‌ని ప‌లువురు క్రికెట్ అభిమానులు అంటున్నారు. కిషన్ 103 బంతుల్లో 8 సిక్సర్లు, 20 ఫోర్లతో 150 పరుగులు చేశాడు. వీరోచితమైన బ్యాటింగ్ చేసి అమేజింగ్ సెంచరీని సాధించాడు. మరో విరాట్ కోహ్లీ కూడా తనదైన స్టైల్ తో బ్యాటింగ్ చేస్తూ 50 ప‌రుగులు చేశాడు. మొత్తం మీద మూడో వ‌న్డేలో భార‌త్ భారీ స్కోర్ దిశ‌గా ప‌రుగులు తీస్తుంది. బంగ్ల‌దేశ్ కు ఇక చుక్క‌లే అని క్రికెట్ అభిమానులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement