Tuesday, April 16, 2024

పెరిగిన ఈవీ టూ వీలర్ల ధరలు… ఫేమ్‌2 సబ్సిడీ కోత ఫలితం

కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ టూ వీలర్లను ప్రోత్సహించేందుకు తీసుకు వచ్చిన ఫేమ్‌ 2 సబ్సిడీలో భారీగా కోత విధించడంతో జూన్‌ 1 నుంచి వీటి ధరలు పెరిగాయి. ఫేమ్‌2 సబ్సిడీని ప్రభుత్వం 40 నుంచి 15 శాతానికి తగ్గించింది. దీంతో విద్యుత్‌ టూ వీలర్స్‌ను ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు వీటి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఒక్కో కిలోవాట్‌ బ్యాటరీ సామర్ధ్యానికి ప్రభుత్వం గతంలో 15వేలు రాయితీ ఇచ్చేంది. దీన్ని ప్రస్తుతం జూన్‌ 1 నుంచి 10 వేలకు తగ్గించింది. ఒక వాహన ధరలో గరిష్టంగా ఉన్న 40 శాతం సబ్సిడీని 15 శాతానికి పరిమితం చేసింది.

టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న ఐక్యూబ్‌ విద్యుత్‌ స్కూటర్‌ ధరను 17 వేల నుంచి 22 వేల వరకు పెంచుతున్నట్లు ప్రకటించంది. మోడల్‌ను బట్టి ఈ ధర ఆధారపడి ఉంటుంది. ఏథర్‌ ఎనర్జీ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న ఏథర్‌ 450 ఎక్స్‌ మోడల్‌ ధరను పెంచింది. ఏథర్‌ 450 ప్రో ధరలను కూడా కంపెనీ పెంచింది. ఏథర్‌50 ఎక్స్‌ మోడల్‌ ధర పెంచిన తరువాత 1.45 లక్షలకు, 450 ప్రో ధర 1.65 లక్షలకు పెరిగింది. కంపెనీ ఒక్కో స్కూటర్‌పై 8 వేలు మాత్రమే పెంచింది. సబ్సిడీలో కోత మూలంగా 32 వేలు భారం పడుతున్నప్పటికీ, వినియోగదారులపై పూర్తి భారాన్ని వేయకుండా ధరలను కొద్దిగా మాత్రమే పెంచినట్లు ఏథర్‌ తెలిపింది.

- Advertisement -

ఎలా ఎలక్ట్రిక్‌ కంపెనీ కూడా అన్ని మోడల్స్‌ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరల ప్రకారం ఓలా ఎస్‌ప్రో దర 1,39,999 రూపాయలకు, ఎస్‌1 ధర 1,29,999 రూపాయలకు, ఎస్‌1 ఎయిర్‌ ధర 1,09,999 రూపాయలకు పెరిగాయి. గత ధరలతో పోల్చితే ఒక్కో స్కూటర్‌ పై ఓలా 15 వేలు పెంచింది. పూర్తి భారం కస్టమర్లపై వేయకుండా ధరలను స్వల్పంగానే పెంచినట్లు ఓలా ఎలక్ట్రిక్‌ తెలిపింది. ప్రభుత్వం సబ్సిడీలను తగ్గించినప్పటికీ, తాము ధరలు పెంచడంలేదని హీరో ఎలక్ట్రిక్‌ కంపెనీ ప్రకటించింది. విద్యుత్‌ వాహనాల అమ్మకాలపై ప్రభావం పడుతుందనే తాము వీటి ధరలను పెంచలేదని కంపెనీ తెలిపింది.

ఏథర్‌ నుంచి మరో స్కూటర్‌…


ప్రముఖ విద్యుత్‌ స్కూటర్ల తయారీ సంస్థ ఏథర్‌ ఎనర్జీ ఎంట్రీ లెవల్‌లో మరో విద్యుత్‌ స్కూటర్‌ను మార్కెట్‌లోకి తీసుకు వస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఏథర్‌ పేరుతో కంపెనీ రెండు వెర్షన్స్‌లో స్కూటర్స్‌ను విక్రయిస్తోంది. తాజాగా అదే సిరీస్‌లో ఏథర్‌ 450 ఎస్‌ పేరుతో ఎంట్రీ లెవల్‌ స్కూటర్‌ను తీసుకు వస్తున్నట్లు తెలిపింది. ఏథర్‌ 450ఎస్‌ ధరను కంపెనీ 1,29,999 రూపాయలుగా నిర్ణయించింది. దీని టాప్‌ స్పీడ్‌ 90కిలోమీటర్లు. ఒకసారి పూర్తి ఛార్జ్‌ చేస్తే గరిష్టంగా 115 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్కు సంబంధించి ఏథర్‌ ఇతర వివరాలను వెల్లడించలేదు. ఓలా ఎంట్రీ లెవల్‌ స్కూటర్‌ ఎస్‌1 ఎయిర్‌కు పోటీగానే ఏథర్‌ 450 ఎస్‌ను తీసుకు వస్తుందని భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement