Thursday, April 25, 2024

ఉద్యోగుల‌కు ఊర‌ట – ఆదాయ‌ప‌న్ను ప‌రిమితిని రూ.7ల‌క్ష‌ల‌కు పెంపు..

న్యూఢిల్లీ – అమృత్ కాల్ లో ఇది తొలి బ‌డ్జెట్ అంటూ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మ లా సీతారామ‌న్ త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని ప్రారంభించారు..లోక్ స‌భ‌లో కేంద్ర బ‌డ్జెట్ ను నేడు ఆమె ప్ర‌వేశ‌పెట్టారు.. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ,
రైతు, పేద, మధ్యతరగతి వారి కోసం బడ్జెట్ రూపొందించామని నిర్మలా సీతారామన్ తెలిపారు. బ‌డ్జెట్ లో ఉద్యోగ‌జీవుల‌కు ఊర‌ట క‌లిగించారు.. ఆదాయ‌ప‌న్ను ప‌రిమితిని రూ.5 ల‌క్ష‌ల నుంచి 7 ల‌క్ష‌లలకు పెంచారు.. ఆదాయం 7 ల‌క్ష‌లు దాటితే అయిదు శ్లాబుల‌లో ప‌న్ను చెల్సించాల్సి ఉంటుంది.. రూ.15 లక్షలు ఆదాయం ఉన్నట్లయితే ఏకంగా 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాగా,ఏడు లక్షలు దాటితే రూ.3 లక్షల నుంచే పన్ను చెల్లించాలి.. మూడు నుంచి 6 లక్షలవరకు అయిదు శాతం, అరు నుంచి 9 లక్షల వరకు 10 శాతం, 9 లక్షల నుంచి 12 లక్షల వరకు 20 శాతం, 12 లక్షల నుంచి 15 లక్షల వరకు 25 శాతం, 15 లక్షలు దాటితే 30 శాతం పన్ను చెల్లించాల్సిందే.
సీనియర్‌ సిటిజన్స్‌లో పొదుపు పథకంలో భాగంగా డిపాజిట్‌ పరిమితి పెంపు
ప్రస్తుతం రూ.15లక్షల వరకూ ఉన్న పరిమితిని డబుల్‌ చేసి, రూ.30లక్షలకు పెంపు

మహిళలు, బాలికల కోసం కొత్త స్కీమ్‌
మహిళలు, బాలికల కోసం సమ్మాన్ బచత్ పత్ర అనే కొత్త స్కీమ్‌.. 2025 వరకు అమల్లోకి

మహిళల కోసం కొత్త స్కీమ్‌
ఆజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగంగా మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్రం కొత్త పథకం
మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ను ప్రవేశపెట్టింది.
రెండేళ్ల కాలానికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది.
ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకంలో డిపాజిట్‌పై 7.5 శాతం స్థిర వడ్డీ ఉంటుంది.
గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు ఈ పథకంలో డిపాజిట్‌ చేయొచ్చు.
అలాగే గ్రామీణ బ్యాంకుల‌లో చేసే డిపాజిట్స్ మొత్తాన్ని పెంచారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement